స్థానిక ఎన్నికల వేళ.. సూడా చైర్మన్‌తో బలగ ప్రవీణ్ కుమార్ భేటీ
నరసన్నపేట, సూర్య : రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నరసన్నపేట కూటమి జెడ్పీటీసీ అభ్యర్థి బలగ ప్రవీణ్ కుమార్, సూడా చైర్మన్ కొరికాన రవికుమార్‌ను ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశాలపై ఇరువురూ చర్చించినట్లు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం పెంపొందించడం, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం, ఎన్నికల్లో సమష్టిగా పనిచేయడం వంటి అంశాలు చర్చకు వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులు అభిప్రాయపడ్డారు. ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులంతా ఐక్యంగా పనిచేసి విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నరసన్నపేట నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.
రిపోర్టర్ : గోపాల్ కృష్ణ, నరసన్నపేట, శ్రీకాకుళం జిల్లా.