పాతచీరాలలో వ్యక్తిపై కత్తితో దాడి*
*పాతచీరాలలో వ్యక్తిపై కత్తితో దాడి*
చీరాల: బాపట్ల జిల్లా చీరాల మండలం పాతచీరాలలో ఆదివారం బొల్లెపల్లి మాధవరావుపై కత్తితో దాడి జరిగింది. ఈ ఘటనలో గాయపడిన మాధవరావును చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.పోలేరమ్మ ఆలయ కమిటీ విషయంలో నెలకొన్న వివాదం దాడికి దారితీసినట్లు మాధవరావు కుటుంబ సభ్యులు తెలిపారు. కోటి తండ్రిని మాధవరావు దూషించాడనే కోపంతో కోటి తన స్నేహితుడు పవన్‌తో కలిసి దాడి చేసినట్లు ఆరోపించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.