BREAKING
ఆరోగ్య పరీక్షలు ఎందుకు ముఖ్యం? వయసును బట్టి ఏ టెస్టులు చేయించుకోవాలి? ఐక్యతతోనే బలిజలకు అభివృద్ధి సాధ్యం -రాజకీయ బలోపేతానికి కార్పొరేషన్ ఎన్నికలు వినియోగించుకోవాలి -మేయర్ తో పాటు 16 మంది అభ్యర్థులను గెలిపించుకోవాలి : ఎమ్మెల్యే ఆరణి పిలుపు కాళేశ్వరం కూల్చింది మీరు.. నీళ్లపై దుష్ప్రచారమా?: కేటీఆర్‌పై ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ఫైర్‌.. కీసర ప్రధాన చౌరస్తాలో వెలగని ఐమాస్ లైట్లు.. ప్రమాదాల భయంతో ప్రజల ఆందోళన రేపు మొయినాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం తిమ్మాయపల్లిలో పేకాట స్థావరంపై కీసర పోలీసుల దాడి.. ఐదుగురు అరెస్ట్ శరీరానికి సరిపడా నీరు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? 2027 డకార్ రేస్ సౌదీ అరేబియాలో నిర్వహించడం లేదని వెల్లడి ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం రోజూ తీసుకోవాల్సిన సమతుల్య ఆహారం ఏమిటి? శస్త్రచికిత్స తర్వాత మొదటిసారి బహిరంగంగా స్పందించిన పోప్ లీయో గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో చియా సీడ్స్, అవిసె గింజల్లో ఏది బెటర్? నిపుణుల సలహాలు! బ్రెజిల్ ఎన్నికల వేళ ఓటర్లను వేధిస్తున్న ప్రధాన సమస్యలు జవహర్ నగర్ డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి – ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ జల్సా నివాసం వెలుపల అభిమానులను పలకరించిన అమితాబ్ బచ్చన్.. ఆరోగ్య రికవరీ వేళ భారీ భద్రత నడుమ సందడి! ప్రచార కార్యక్రమంలో స్పీడ్ పెంచిన 11వ టిడిపి కౌన్సిలర్ షాకిరా మౌలాలి

అయ్యప్ప స్వాముల మహా పాదయాత్రలో పాల్గొన్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మాద్రి పృథ్వీరాజ్

Select Suryaa Now
అయ్యప్ప స్వాముల మహా పాదయాత్రలో పాల్గొన్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మాద్రి పృథ్వీరాజ్

 పటాన్‌చెరు ;పటాన్‌చెరు నియోజవర్గానికి చెందిన అయ్యప్ప స్వాములు బీహెచ్‌ఈఎల్‌ లోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం నుంచి శబరిమలలోని శ్రీ అయ్యప్ప స్వామి సన్నిధానం వరకు చేపట్టిన మహా పాదయాత్ర కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ఎండిఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ l పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీస్సులు పొందారు.ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ, అయ్యప్ప స్వామి మాలధారణ భక్తుల్లో ఆధ్యాత్మిక చింతనను పెంపొందించడంతో పాటు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, క్రమశిక్షణ, ఆత్మనిగ్రహాన్ని అలవర్చుకోవడంలో ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. అయ్యప్ప స్వామిపై అచంచలమైన భక్తిశ్రద్ధలతో చేపట్టే మహా పాదయాత్ర ఆధ్యాత్మిక చైతన్యాన్ని, ఐక్యతను, సహనం, సేవాభావాన్ని మరింత పెంపొందిస్తుందని తెలిపారు.*అయ్యప్ప స్వాములు భక్తిశ్రద్ధలతో, నియమ నిష్ఠలతో శబరిమల యాత్రను కొనసాగించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆకాంక్షిస్తూ, యాత్ర విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలిపారు. అయ్యప్ప స్వాములు “స్వామియే శరణం అయ్యప్ప నామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని భక్తిభావంతో నింపారు.ఈ కార్యక్రమంలో మల్లేష్ గారు, శ్రీనివాస్ గారు, మహేష్ గారు, భాను గారు, కిషోర్ మరియు  యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.