BREAKING
ఆరోగ్య పరీక్షలు ఎందుకు ముఖ్యం? వయసును బట్టి ఏ టెస్టులు చేయించుకోవాలి? ఐక్యతతోనే బలిజలకు అభివృద్ధి సాధ్యం -రాజకీయ బలోపేతానికి కార్పొరేషన్ ఎన్నికలు వినియోగించుకోవాలి -మేయర్ తో పాటు 16 మంది అభ్యర్థులను గెలిపించుకోవాలి : ఎమ్మెల్యే ఆరణి పిలుపు కాళేశ్వరం కూల్చింది మీరు.. నీళ్లపై దుష్ప్రచారమా?: కేటీఆర్‌పై ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ఫైర్‌.. కీసర ప్రధాన చౌరస్తాలో వెలగని ఐమాస్ లైట్లు.. ప్రమాదాల భయంతో ప్రజల ఆందోళన రేపు మొయినాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం తిమ్మాయపల్లిలో పేకాట స్థావరంపై కీసర పోలీసుల దాడి.. ఐదుగురు అరెస్ట్ శరీరానికి సరిపడా నీరు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? 2027 డకార్ రేస్ సౌదీ అరేబియాలో నిర్వహించడం లేదని వెల్లడి ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం రోజూ తీసుకోవాల్సిన సమతుల్య ఆహారం ఏమిటి? శస్త్రచికిత్స తర్వాత మొదటిసారి బహిరంగంగా స్పందించిన పోప్ లీయో గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో చియా సీడ్స్, అవిసె గింజల్లో ఏది బెటర్? నిపుణుల సలహాలు! బ్రెజిల్ ఎన్నికల వేళ ఓటర్లను వేధిస్తున్న ప్రధాన సమస్యలు జవహర్ నగర్ డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి – ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ జల్సా నివాసం వెలుపల అభిమానులను పలకరించిన అమితాబ్ బచ్చన్.. ఆరోగ్య రికవరీ వేళ భారీ భద్రత నడుమ సందడి! ప్రచార కార్యక్రమంలో స్పీడ్ పెంచిన 11వ టిడిపి కౌన్సిలర్ షాకిరా మౌలాలి

ప్రజాస్వామ్యం అపహాస్యం చేసేలా స్థానిక సంస్థల ఎన్నికలు

Select Suryaa Now
ప్రజాస్వామ్యం అపహాస్యం చేసేలా స్థానిక సంస్థల ఎన్నికలు

ఆమదాలవలస, సూర్య : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను అధికార దుర్వినియోగం, దాడులు, బెదిరింపులతో ఏకపక్షంగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మాజీ స్పీకర్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం పార్లమెంటరీ సమన్వయకర్త తమ్మినేని సీతారాం విమర్శించారు. ఆమదాలవలసలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ప్రజాస్వామ్య వ్యవస్థకే సవాలుగా మారుతున్నాయని ఆరోపించారు. నామినేషన్ పత్రాలను చింపివేయడం, అభ్యర్థులను బెదిరించడం, కిడ్నాప్‌లు చేయడం, బలవంతంగా నామినేషన్లు ఉపసంహరింపజేయడం వంటి చర్యలతో ఎన్నికల వాతావరణాన్ని భయానకంగా మారుస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడి నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ఉపయోగపడాలి తప్ప, ప్రత్యర్థులను అణచివేయడానికి కాదని వ్యాఖ్యానించారు. ఎన్నికలు ప్రజల తీర్పును ప్రతిబింబించే ప్రజాస్వామ్య పండుగలని, అలాంటి ప్రక్రియలో నామినేషన్ కేంద్రాలను యుద్ధ వాతావరణంలోకి నెట్టడం సరికాదన్నారు. అధికార పార్టీ నేతల అండతో పోలీసులు ప్రతిపక్ష అభ్యర్థుల పట్ల దురుసుగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శించారు. మాజీ మంత్రి, బీసీ మహిళా నాయకురాలు విడుదల రజని పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు అమానుషమని ఆరోపించారు. ఒక మహిళా ప్రజాప్రతినిధి పట్ల ఇంత కఠినంగా వ్యవహరించడం మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనన్నారు. ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించిన మహిళా ఎస్సైపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొంటూ, క్షేత్రస్థాయిలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై సమగ్రంగా పరిశీలన జరగాలని అన్నారు. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ కింది స్థాయి పోలీసు సిబ్బందిని బాధ్యులుగా నిలబెట్టడం కాకుండా, ఘటనలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయస్థానాల జోక్యం ఉన్నప్పటికీ ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతపై ఆందోళనలు కొనసాగుతున్నాయని అన్నారు. ప్రతిపక్ష అభ్యర్థులకు స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసే అవకాశం కల్పించాలని, బెదిరింపులు, దౌర్జన్యాలకు తావులేకుండా ఎన్నికలు నిర్వహించాలని కోరారు. నామినేషన్ల పరిశీలనలో పారదర్శకత, వీడియో రికార్డింగ్, తగిన భద్రత వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. సూపర్ సిక్స్ హామీల అమలులో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కుల, మతాలు, పార్టీలతో సంబంధం లేకుండా అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందించామని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థల ద్వారా ప్రజలకు సేవలు అందించామని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం గ్రామీణ వ్యవస్థను బలహీనపరుస్తూ, అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరూ భయపడవద్దని తమ్మినేని పిలుపునిచ్చారు. బెదిరింపులు, అక్రమ కేసులు ఎదురైనా చట్టబద్ధంగా పోరాడాలని సూచించారు. అభ్యర్థులకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎన్నికల్లో ప్రజాస్వామ్య హక్కులను కాపాడుకోవడానికి ఐక్యంగా నిలబడాలని కోరారు. రానున్న మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కేవలం పదవుల కోసం జరిగే పోటీలు కావని, ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించినవని పేర్కొన్నారు. ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకుని, తమకు నచ్చిన అభ్యర్థులను ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించి, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలోపేతం చేయాలని ఆయన కోరారు.

రిపోర్టర్ : రాము, సరుబుజ్జి, ఆమదాలవలస, శ్రీకాకుళం జిల్లా.