ఎన్నికల జోరు పెంచిన 46వ వార్డు కూటమి అభ్యర్థి షణ్ముఖేశ్వరి
సీతమ్మధార, సూర్య : జీవీఎంసీ 46 వార్డు కూటమి అభ్యర్థి షణ్ముఖేశ్వరి వార్డులో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 46వ వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి తన వంతు కృషి చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. తమ అమూల్యమైన ఓటును గాజు గ్లాస్ పై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఆళ్ల లీలావతి, ఆళ్ల శ్రీను, ఆళ్ల శివ గణేష్, నాయకులు. కార్యకర్తలు పాల్గొన్నారు.
రిపోర్టర్ : శ్రీను, సీతమ్మధార, విశాఖపట్నం.