BREAKING
జల్సా నివాసం వెలుపల అభిమానులను పలకరించిన అమితాబ్ బచ్చన్.. ఆరోగ్య రికవరీ వేళ భారీ భద్రత నడుమ సందడి! ప్రచారం కార్యక్రమంలో స్పీడ్ పెంచిన 11వ టిడిపి కౌన్సిలర్ షాకిరా మౌలాలి కర్నూలు 13వ వార్డులో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం చరిత్ర సృష్టించిన హర్మన్‌ప్రీత్ కౌర్.. మిథాలీ రాజ్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్ టీమిండియా భవిష్యత్ స్టార్ తిలక్ వర్మ అద్భుత ప్రదర్శన.. యువ బ్యాటర్‌కు కోచ్ గాంబీర్ విలువైన సూచనలు! ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా.. 17వ డివిజన్‌లో జనసేన అభ్యర్థి భవాని రవికుమార్‌ విస్తృత ప్రచారం కర్నూలు 19వ వార్డు బుధవారపేటలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం నా అభిమానులను ఎప్పటికీ గర్వపడేలా చేస్తా.. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఎమోషనల్! జనసేన పార్టీ నుండి వైఎస్సార్‌సీపీలోకి జనసేన ఆలమూరు మండల ఉపాధ్యక్షులు కొనగళ్ల ధనరాజు నాయుడు ఎంపిపి అభ్యర్థి వెంగయ్యకు శుభాకాంక్షలు తెలిపిన టిడిపినేత బడేనాయబ్ రసూల్: జెట్ స్పీడుతో టీడీపీ 21 వార్డు కౌన్సిలర్ అభ్యర్థి రాజశేఖర్ ప్రచారం వేలం పాటల రాజకీయం మానండి : మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా హితవు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన జనసేన నాయకులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల – రుద్రారంలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన. అల్లుగుండులో దాడి కేసు: ఆరుగురి అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు

వారం రోజులుగా మరమ్మతులు ఏవీ??

Select Suryaa Now
వారం రోజులుగా మరమ్మతులు ఏవీ??

 జిన్నారం :జిన్నారం మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డు నర్రిగూడెంలో తాగునీటి పైప్‌లైన్‌ లీకేజీ సమస్య కాలనీవాసులను ఆందోళనకు గురిచేస్తోంది. పైప్‌లైన్‌ మరమ్మతుల కోసం వారం రోజుల క్రితం తవ్విన గుంతను అలాగే వదిలేయడంతో ప్రమాదం పొంచి ఉందని స్థానికులు వాపోతున్నారు. మరోవైపు పైప్‌లైన్‌ నుంచి నీరు వృథాగా పోతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైప్‌లైన్‌ లీకేజీని అరికట్టేందుకు గుంత తవ్వినప్పటికీ, వారం రోజులు గడుస్తున్నా మరమ్మతులు పూర్తి చేయకపోవడంపై కాలనీవాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గుంత కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ముఖ్యంగా రాకపోకలు సాగించే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొందని స్థానిక ప్రజలు పేర్కొంటున్నారు. ఇప్పటికే విద్యుత్‌ కోతలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు, మరోవైపు నీటి వృథా కారణంగా భవిష్యత్తులో నీటి ఎద్దడి తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించాలి
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తక్షణమే పైప్‌లైన్‌ లీకేజీని అరికట్టి, మరమ్మతులు పూర్తి చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు. ప్రమాదకరంగా ఉన్న గుంతను పూడ్చివేసి, నీటి వృథాను అరికట్టేలా మున్సిపల్‌ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.