BREAKING
అనాథ వృద్ధులకు బాలవికాస అండ 40 మంది వృద్ధులకు నిత్యావసర సరుకులు, సమస్యాత్మక గ్రామాలు గుర్తించి అధికారులు అప్రమత్తంగా ఉండాలి తిరుపతిలో టీడీపీకి తిరుగులేదు జేబీ శ్రీనివాస్‌కు కమ్మ సంఘం మద్దతు 66 డివిజన్లలో టీడీపీ జెండా ఎగరడం ఖాయం విద్యార్థి హక్కుల పోరాటానికి బీఆర్ఎస్వీ బలోపేతం -బండచర్లపల్లి,రావురూకులలో నూతన విద్యార్థి కమిటీల ఏర్పాటు నటి ఇంద్రజ చేతుల మీదుగా ‘జుఒన్‌’ సూపర్‌ యాప్‌ ఆవిష్కరణ.. ఒకే వేదికపై 25 రకాల సేవలు! ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు మృత కార్మికుల కుటుంబాలకు యూనియన్ అండ.. -రూ.20 వేల సాయం! తుఫాను నేపథ్యంలో రైతులు అప్రమత్తత అవసరం * సూచనలు అందజేసిన మండల ఏవో మెట్ట మోహనరావు * అభివృద్ధి, సంక్షేమమే ప్రచార అస్త్రాలుగా ముందుకు సాగుదాం ... ఏకగ్రీవ ఎన్నిక ధ్రువపత్రం అందుకున్న సురేష్ నాయుడు స్థానిక సంస్థల జోరు.. రెబల్స్ తో పోరు సైకిల్ గుర్తుకే ఓటు వేయండి.. జడ్పిటిసి అభ్యర్థి శిరీష హడ్కో కాలనీలో వైఎస్సార్‌సీపీ ప్రచార జోరు ఎన్నికలు ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు టీడీపీకి బిగ్ షాక్‌.. వైఎస్సార్‌సీపీలోకి 156 కుటుంబాలు చేరిక!

మల్కాపూర్‌ అసైన్డ్‌ భూములపై అంతుచిక్కని భూసేకరణ వ్యవహారం!

Select Suryaa Now
మల్కాపూర్‌ అసైన్డ్‌ భూములపై అంతుచిక్కని భూసేకరణ వ్యవహారం!

కొండాపూర్‌;రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తున్నారా..? లేక ఒత్తిడి చేసి ఒప్పిస్తున్నారా..? బలవంతపు భూసేకరణకు ప్రయత్నాలు జరుగుతున్నాయా..? మల్కాపూర్‌ రెవెన్యూ శివారులోని సర్వే నంబర్‌ 481 అసైన్డ్‌ భూముల వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జాతీయ రహదారికి ఆనుకుని ఉండటం, గిర్మాపూర్‌ శివారులో ట్రిపుల్‌ఆర్‌ సర్కిల్‌ ఏర్పాటు కానున్న నేపథ్యంలో ఈ ప్రాంత భూములకు విలువ పెరిగింది. ఈ క్రమంలో సుమారు 203 ఎకరాల అసైన్డ్‌ భూముల్లో కొంత భాగాన్ని పారిశ్రామిక అవసరాలకు సమీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే చర్చ సాగుతోంది.గ్రామసభ తర్వాత మళ్లీ సర్వే!జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న సుమారు 12 ఎకరాల 7 గుంటల భూములకు సంబంధించి సుమారు 16 మంది రైతుల అభిప్రాయాలు కీలకంగా మారాయి. దాదాపు రెండేళ్లుగా ఈ భూముల వ్యవహారం చర్చలో ఉండగా, సుమారు 15 రోజుల క్రితం నిర్వహించిన గ్రామసభలో  రైతులు భూములు ఇచ్చేందుకు నిరాకరించినట్లు సమాచారం. రెవెన్యూ అధికారులు మరోసారి సర్వే నిర్వహించడంతో రైతుల్లో సందేహాలు పెరిగాయి.టీజీఐఐసీ ద్వారా ప్రైవేటు పరిశ్రమకు భూములు సమీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం ఉన్నప్పటికీ, దీనిపై అధికారిక ప్రతిపాదనలు, అనుమతుల వివరాలు వెల్లడికావాల్సి ఉంది. భూములు ఇవ్వకపోతే నోటీసులు ఇస్తామని, అవసరమైతే భూములు తీసుకుంటామని చెప్పినట్లు కొందరు రైతులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై అధికారులు స్పందించాల్సి ఉంది.రెండుపంటల భూములు వదులుకోలేం!వ్యవసాయమే తమ కుటుంబాలకు జీవనాధారమని, రెండుపంటలు పండే భూములను వదులుకునేందుకు సిద్ధంగా లేమని రైతులు స్పష్టం చేస్తున్నారు. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని,  తమ బతుకుదెరువును దెబ్బతీసే నిర్ణయాలు తీసుకోవద్దని కోరుతున్నారు. తప్పనిసరిగా భూములు తీసుకోవాల్సి వస్తే ప్రస్తుత మార్కెట్‌ ధర ప్రకారం పరిహారం చెల్లించడంతోపాటు, భూములు కోల్పోయే ప్రతి కుటుంబానికి 600 గజాల ఇంటి స్థలం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు.రైతుల ఆవేదన.. వారి మాటల్లోనే!రైతు తోగర్పల్లి సాయిలు: “జాతీయ రహదారికి ఆనుకుని నాకు సుమారు 20 గుంటల భూమి ఉంది. ఎకరాకు కోట్ల రూపాయలు ఇస్తామని చెబుతున్నా భూమి ఇచ్చేందుకు సిద్ధంగా లేను. మా తాతల కాలం నుంచి సాగు చేసుకుంటూ బతుకుతున్నాం. రెండుపంటలు పండే భూమి పోతే మా కుటుంబానికి జీవనాధారం ఉండదు. భూములు తీసుకోవాల్సి వస్తే మార్కెట్‌ ధర ప్రకారం న్యాయమైన పరిహారం ఇవ్వాలి.”రైతు రత్నయ్య: “మా భూముల్లో రెండుపంటలు పండుతున్నాయి. భూములు ఇచ్చే ఉద్దేశం మాకు లేదు. తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తే న్యాయమైన పరిహారంతోపాటు మా కుటుంబానికి 600 గజాల ఇంటి స్థలం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలి. మా అభ్యంతరాలను పట్టించుకోకుండా భూములు తీసుకుంటే ఎలా బతకాలి? రైతులకు భరోసా కల్పించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి.”అధికారుల వివరణపై ఆసక్తి!సర్వే నంబర్‌ 481లో భూముల సమీకరణకు అధికారిక ప్రతిపాదన ఉందా? ఏ పరిశ్రమ కోసం భూములు అవసరమయ్యాయి? గ్రామసభలో ఎంతమంది రైతులు అంగీకరించారు? భూములు ఇవ్వడానికి నిరాకరించిన రైతులపై ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణల్లో వాస్తవమెంత? అనే ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది. గతంలోనూ ఈ భూముల వ్యవహారంపై సూర్య దినపత్రికలో కథనాలు ప్రచురితమయ్యాయి. రైతుల హక్కులు, చట్టబద్ధమైన భూసేకరణ ప్రక్రియ, న్యాయమైన పరిహారంపై అధికారులు స్పష్టత ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.