కూటమి ప్రభుత్వం విజయమే లక్ష్యంగా పనిచేయాలి
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంస్థానిక సంస్థల ఎన్నికలలో నియోజకవర్గంలోని కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు ఆదివారం మండలంలోని వద్దిపర్రు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. పేరవరం నీటి సంఘం అధ్యక్షులు మాజీ సర్పంచ్ జోజవరపు హరిబాబు ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు, వీరవల్లి సుబ్రహ్మణ్యం కార్యకర్తలు, యువత వైసీపీని వీడి 25 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారందరికీ ఎమ్మెల్యే బండారు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యానందరావు గారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, అభివృద్ధి, సంక్షేమ పాలనకు ఆకర్షితులై ప్రతి గ్రామం నుండి వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయన్నారు. వద్దిపర్రు గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం, ప్రాధాన్యత ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర టి ఎన్ టి యు సి కార్యనిర్వహక కార్యదర్శి ముళ్ళపూడి భాస్కరరావు, మండల తెలుగు యువత అధ్యక్షులు వెచ్చ అనిల్ కుమార్ చిటికెన సత్యనారాయణ, గంటి నాగేశ్వరరావు, వజ్ర కుమార్, దండు సీతారామరాజు, బంగార్రాజు, గోపాల రాజు, ప్రవీణ్, కుటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు