కాట శ్రీనివాస్ గౌడ్‌కు దసరా శుభాకాంక్షలు తెలిపిన ఇంద్రేశం కౌన్సిలర్ మన్నె లక్ష్మి
పటాన్‌చెరు;విజయదశమి పండుగను పురస్కరించుకుని ఇంద్రేశం కౌన్సిలర్ మన్నె లక్ష్మి పటాన్‌చెరు కాంగ్రెస్ ఇన్‌చార్జి కాట శ్రీనివాస్ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.విజయదశమి పర్వదినం ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, విజయాలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబం ఆనందంగా,సంతోషంగా పండుగను జరుపుకోవాలని కోరుకున్నారు. పండుగలు ప్రజల మధ్య ఆత్మీయతను, సోదరభావాన్ని పెంపొందిస్తాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు.