BREAKING
గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో చియా సీడ్స్, అవిసె గింజల్లో ఏది బెటర్? నిపుణుల సలహాలు! బ్రెజిల్ ఎన్నికల వేళ ఓటర్లను వేధిస్తున్న ప్రధాన సమస్యలు జవహర్ నగర్ డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి – ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ జల్సా నివాసం వెలుపల అభిమానులను పలకరించిన అమితాబ్ బచ్చన్.. ఆరోగ్య రికవరీ వేళ భారీ భద్రత నడుమ సందడి! ప్రచార కార్యక్రమంలో స్పీడ్ పెంచిన 11వ టిడిపి కౌన్సిలర్ షాకిరా మౌలాలి కర్నూలు 13వ వార్డులో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం చరిత్ర సృష్టించిన హర్మన్‌ప్రీత్ కౌర్.. మిథాలీ రాజ్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్ టీమిండియా భవిష్యత్ స్టార్ తిలక్ వర్మ అద్భుత ప్రదర్శన.. యువ బ్యాటర్‌కు కోచ్ గాంబీర్ విలువైన సూచనలు! ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా.. 17వ డివిజన్‌లో జనసేన అభ్యర్థి భవాని రవికుమార్‌ విస్తృత ప్రచారం కర్నూలు 19వ వార్డు బుధవారపేటలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం నా అభిమానులను ఎప్పటికీ గర్వపడేలా చేస్తా.. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఎమోషనల్! జనసేన పార్టీ నుండి వైఎస్సార్‌సీపీలోకి జనసేన ఆలమూరు మండల ఉపాధ్యక్షులు కొనగళ్ల ధనరాజు నాయుడు ఎంపిపి అభ్యర్థి వెంగయ్యకు శుభాకాంక్షలు తెలిపిన టిడిపినేత బడేనాయబ్ రసూల్: జెట్ స్పీడుతో టీడీపీ 21 వార్డు కౌన్సిలర్ అభ్యర్థి రాజశేఖర్ ప్రచారం వేలం పాటల రాజకీయం మానండి : మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా హితవు

కరువు ముప్పు పొంచి ఉన్నా.. కొత్త బోర్లకు అడ్డుకట్టేది ఎవరు?

Select Suryaa Now
కరువు ముప్పు పొంచి ఉన్నా.. కొత్త బోర్లకు అడ్డుకట్టేది ఎవరు?

హుస్నాబాద్ :ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందన్న ఆందోళనల నేపథ్యంలో నీటిని పొదుపుగా వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే హుస్నాబాద్ ప్రాంతంలో కొత్త బోర్లు వేయడానికి అనుమతులు లేవని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, మరోవైపు బోర్‌వెల్స్ నిర్వాహకులు నిత్యం కొత్త బోర్లు వేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు స్పందించకుండా మౌనం వహిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ నిబంధనలు అమలవుతున్నాయా?:

భూగర్భ జలాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నప్పటికీ, కొత్త బోర్ల తవ్వకాల విషయంలో నిబంధనలు ఎంతవరకు అమలవుతున్నాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నీటి లభ్యతను పరిగణనలోకి తీసుకోకుండా ఇష్టానుసారంగా బోర్లు వేస్తే భూగర్భ జలమట్టం మరింత పడిపోయే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో వేసవిలో తాగునీటి అవసరాలు తీర్చుకోవడం సవాలుగా మారుతున్న తరుణంలో, విచ్చలవిడిగా బోర్లు వేయడం భవిష్యత్తులో మరిన్ని సమస్యలకు దారితీయవచ్చని అంటున్నారు.

అధికారుల పర్యవేక్షణ ఏది?:

కొత్త బోర్ల తవ్వకాలపై నిఘా ఉంచాల్సిన సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి, నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కేవలం నిబంధనలు ప్రకటించడం కాకుండా వాటిని కచ్చితంగా అమలు చేయాలని, అనుమతుల విషయంలో పారదర్శకత పాటించాలని సూచిస్తున్నారు.

నీటి పొదుపుపై అవగాహన కల్పించాలి :

రానున్న రోజుల్లో కరువు పరిస్థితులు ఏర్పడితే తాగునీటి కొరత తీవ్ర రూపం దాల్చే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఈ నేపథ్యంలో బోర్ వెల్స్  యజమానులకు రైతులకు భూగర్భ జలాల సంరక్షణ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతున్నారు . వర్షం నీటిని ఓడిసిపట్టడం ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడం అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించడం వంటి చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు.

ఇకనైనా అధికారులు మేల్కొంటారా?:

హుస్నాబాద్ ప్రాంతంలో కొత్త బోర్ల తవ్వకాలపై సమగ్ర విచారణ చేపట్టి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు నీటి సమస్య తీవ్ర రూపం దాల్చిన తర్వాత స్పందించడం కంటే ముందుగానే అప్రమత్తమై భూగర్భ జలాలను సంరక్షించాలని కోరుతున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచి భవిష్యత్తులో తాగునీటి కొడితే ఏర్పడకుండా తగిన చర్యలు చేపట్టాలని ప్రాంత ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.