BREAKING
లైన్స్ క్లబ్ ఆఫ్ వట్పల్లి వారి ఆధ్వర్యంలో, కుట్టు మిషన్లు పంపిణీ. స్థానిక ఎన్నికల వేళ.. సూడా చైర్మన్‌తో బలగ ప్రవీణ్ కుమార్ భేటీ పామూరులో బంగారం చోరీ అయ్యప్ప స్వాముల మహా పాదయాత్రలో పాల్గొన్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మాద్రి పృథ్వీరాజ్ శతకాలతో చెలరేగిన హర్మన్‌ప్రీత్, దీప్తి శర్మ.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యాన్ని ఉంచిన భారత మహిళల జట్టు! క్రీడల్లో రాణించి జిల్లా ఖ్యాతిని చాటాలి శ్రీ నారాయణస్వామి ఆశీస్సులతో బుజ్జికి విజయం ఖాయం అభ్యర్థులకు వైఎస్సార్‌సీపీ బి-ఫారాలు అందజేత అభివృద్ధిని చూసి గెలిపించండి - ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఆదేశాల మేరకు ప్రచారం జోరు - మేయర్ అభ్యర్థి కటారి హేమలత గెలుపు కోసం కార్పొరేటర్ అభ్యర్థి తేజశ్రీ పచ్చప్ప విస్తృత ప్రచారం వైయస్సార్సీపి అభ్యర్థుల గెలుపుకు కృషి భారత్ - న్యూజిలాండ్ మూడో టీ20.. బ్యాటింగ్ ఆర్డర్‌లో కీలక మార్పులు చేయాలన్న అశ్విన్! మున్సిపల్ సిబ్బందిని పర్మినెంట్ చేయాలి ప్రజాస్వామ్యం అపహాస్యం చేసేలా స్థానిక సంస్థల ఎన్నికలు పాతచీరాలలో వ్యక్తిపై కత్తితో దాడి* అట్రాక్టివ్ లుక్స్‌తో అదరగొడుతున్న నటి మానస వారణాసి.. లేటెస్ట్ ఫొటోషూట్ వైరల్!

అజయ్ బాబును గెలిపించండి అభివృద్ధి చేసి చూపిస్తా

Select Suryaa Now
అజయ్ బాబును గెలిపించండి అభివృద్ధి చేసి చూపిస్తా

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంఅధికారంలో ఉన్నప్పుడు ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మండపేట ను అభివృద్ధి చేయని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు ఎలా అడుగుతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు డిమాండ్ చేశారు. మండపేట తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.  తాను 2000 లో మున్సిపల్ చైర్మన్ గా అధికారం చేపట్టిన తర్వాత అనేక సంస్కరణలకు నాంది పలకడం జరిగిందన్నారు. తొలిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇంటింటా చెత్త సేకరణ విధానం మండపేట లోనే ప్రారంభించడం జరిగిందన్నారు. అప్పట్లో తాము చేసిన అభివృద్ధిని చూసి ఆ తరువాత అధికారంలోకి వచ్చిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తమకు అవార్డు ను కూడా అందివ్వడం జరిగిందన్నారు. ఆ తరువాత విమల కుమారి హయాంలోనూ, దివంగత చుండ్రు శ్రీ వర ప్రకాష్ హయాంలోనూ మండపేట మున్సిపాలిటీని అభివృద్ధిలో పరుగులు పెట్టించడం జరిగిందన్నారు. దక్షిణ భారతదేశంలోనే 2వ స్థానం ప్రకాష్ హయాంలో సాధించడం జరిగిందన్నారు. టీడీపీ అధికారం లో ఉన్న కారణంగానే అభివృద్ధిలో మండపేట అగ్ర స్థానంలో నిలిచిందన్నారు. అయితే దురదృష్టవశాత్తూ 2019 లో ప్రజలు వైసీపీ కి అధికారం కట్టబెడితే అభివృద్ధిలో దారుణంగా వెనుకబాటు తనానికి గురైందని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మున్సిపాలిటీ లో అభివృద్ధి పనులు చేపట్టలేకపోయారని దుయ్యబట్టారు. అధికారంలో ఉన్నప్పుడే ఏమి చేయలేకపోయినా వారు ఇప్పుడెలా ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. అదే విధంగా మున్సిపల్ చైర్మన్ గా పోటీ చేస్తున్న అజయ్ బాబును, 36 వార్డుల కూటమి అభ్యర్థులను సైకిల్, గాజు గ్లాస్, కమలం గుర్తుపై ఓట్లేసి ప్రజలు గెలిపిస్తే అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తానన్నారు. గడిచిన ఆరు నెలల్లో మండపేట లో ఎలాంటి అభివృద్ధి సాధించామో ప్రజలంతా చూశారన్నారు. ఇకపై పట్టణ సుందరీకరణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. ప్రజలంతా టీడీపీ కి మరో అవకాశం కల్పించాలని వేగుళ్ళ కోరారు. ఈ సమావేశంలో అమలాపురం పార్లమెంట్ సభ్యుడు గంటి హరీష్ మాధూర్ గారు, రాష్ట్ర నీటి పారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ వేగుళ్ళ లీలాకృష్ణ గారు, నియోజకవర్గ పరిశీలకురాలు తుమ్మల సునీత, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, అమలాపురం పార్లమెంట్ వాణిజ్య విభాగం అధ్యక్షులు ఉంగరాల రాంబాబు, పట్టణ టీడీపీ అధ్యక్షులు మత్స నాగబాబు, మండపేట మార్కెట్ కమిటీ చైర్మన్ చింతపల్లి రామకృష్ణ, చాపల వీరబాబు, సవరపు సతీష్ తదితరులు పాల్గొన్నారు.