BREAKING
పాత జ్ఞాపకాలకు ఆత్మీయ పలకరింపు లైన్స్ క్లబ్ ఆఫ్ వట్పల్లి వారి ఆధ్వర్యంలో, కుట్టు మిషన్లు పంపిణీ. స్థానిక ఎన్నికల వేళ.. సూడా చైర్మన్‌తో బలగ ప్రవీణ్ కుమార్ భేటీ పామూరులో బంగారం చోరీ అయ్యప్ప స్వాముల మహా పాదయాత్రలో పాల్గొన్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మాద్రి పృథ్వీరాజ్ శతకాలతో చెలరేగిన హర్మన్‌ప్రీత్, దీప్తి శర్మ.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యాన్ని ఉంచిన భారత మహిళల జట్టు! క్రీడల్లో రాణించి జిల్లా ఖ్యాతిని చాటాలి శ్రీ నారాయణస్వామి ఆశీస్సులతో బుజ్జికి విజయం ఖాయం అభ్యర్థులకు వైఎస్సార్‌సీపీ బి-ఫారాలు అందజేత అభివృద్ధిని చూసి గెలిపించండి - ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఆదేశాల మేరకు ప్రచారం జోరు - మేయర్ అభ్యర్థి కటారి హేమలత గెలుపు కోసం కార్పొరేటర్ అభ్యర్థి తేజశ్రీ పచ్చప్ప విస్తృత ప్రచారం వైయస్సార్సీపి అభ్యర్థుల గెలుపుకు కృషి భారత్ - న్యూజిలాండ్ మూడో టీ20.. బ్యాటింగ్ ఆర్డర్‌లో కీలక మార్పులు చేయాలన్న అశ్విన్! మున్సిపల్ సిబ్బందిని పర్మినెంట్ చేయాలి ప్రజాస్వామ్యం అపహాస్యం చేసేలా స్థానిక సంస్థల ఎన్నికలు పాతచీరాలలో వ్యక్తిపై కత్తితో దాడి*

ఓటరు జాబితా సవరణపై ప్రజల్లో అవగాహన కల్పించాలి పటాన్‌చెరులో బీజేపీ ఆధ్వర్యంలో మేధావుల సమావేశం

Select Suryaa Now
ఓటరు జాబితా సవరణపై ప్రజల్లో అవగాహన కల్పించాలి  పటాన్‌చెరులో బీజేపీ ఆధ్వర్యంలో మేధావుల సమావేశం

పటాన్‌చెరు: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు పటాన్‌చెరులోని మున్నూరు కాపు హాల్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)పై మేధావుల సమావేశం నిర్వహించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరు జాబితా ప్రాధాన్యత, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాల్సిన ఆవశ్యకతపై ఈ సమావేశంలో చర్చించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని, ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై ప్రజలకు సరైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడటంతో పాటు, ఓటరు జాబితా ప్రాముఖ్యతపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని సూచించారు.ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మేధావులు, విద్యావంతులు, పార్టీ నాయకులు పాల్గొని ఓటరు జాబితా ప్రాధాన్యతపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అదెల్లి రవీందర్, జిన్నారం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, మేధావుల విభాగం కన్వీనర్ వెంకటేష్, బీజేపీ సీనియర్ నాయకులు ఆంజనేయులు, కుమార్, దేవేందర్ గౌడ్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు రాజేందర్ రెడ్డితో పాటు వివిధ మండలాల అధ్యక్షులు, విద్యావంతులు పాల్గొన్నారు.