BREAKING
మిత్రమా ఎలా ఉన్నావ్.. స్నేహం కోసం... 31 గిన్నస్ ప్రపంచ రికార్డులతో చరిత్ర సృష్టించిన గీతం పూర్వ విద్యార్థిని కేవలం రూ. 2.5 కోట్ల బడ్జెట్.. వంద కోట్ల కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద కన్నడ సినిమా సెన్సేషన్! కరువు మండలంగా ప్రకటించాలి తెలంగాణ రాష్ట్ర యూత్ ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మహబూబ్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న పులిమామిడి రాజు ప్రజల నమ్మకాన్ని గెలిపిస్తాను. కౌన్సిలర్ రామయ్య. మల్లారెడ్డి సేవలు చిరస్మరణీయం 24వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అనాథ పిల్లలకు అన్నదానం రామ్ చరణ్, సుకుమార్ క్రేజీ కాంబో 'RC17' మూవీ లాంచ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే? మనోజ్ బాజ్ పాయ్ కొత్త సినిమా 'గజబ్ రాత్' రివ్యూ.. క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? రైతు కష్టాలు మా కష్టాలే.. అన్నదాతకు ప్రభుత్వం అండగా ఉంటుంది నందికంది గ్రామాన్ని వణికిస్తున్న బ్లూక్రాఫ్ట్ ఆగ్రో కాలుష్యం! వైఎస్సార్‌సీపీ నాయకుడు జగన్ మోహన్‌రెడ్డి మృతికి కాటసాని సంతాపం ఎన్నికల వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి గొడవలకు ఆజ్యం పోసే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు గొడశలపల్లి, కూడ్లూరు గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించిన హీరేహాళ్ ఎస్సై గురు ప్రసాద్ రెడ్డి ప్రత్యేక పూజలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు అయ్యప్ప స్వాముల మహా పాదయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

రెడ్‌క్రాస్ సేవల విస్తరణకు అండగా ఉంటాం - పల్లె గంగారెడ్డి

Select Suryaa Now
రెడ్‌క్రాస్ సేవల విస్తరణకు అండగా ఉంటాం - పల్లె గంగారెడ్డి
సూర్య, ఆర్మూర్ : రెడ్‌క్రాస్ సొసైటీ సేవలను గ్రామగ్రామాన విస్తరించి, రక్తదానంపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి పిలుపునిచ్చారు. రెడ్‌క్రాస్ సొసైటీ ఎన్నికల్లో విజయం సాధించి సభ్యుడిగా ఎన్నికవడంతో పాటు రాష్ట్ర కౌన్సిల్ మెంబర్‌గా నియామకమైన జెస్సు అనిల్‌కుమార్‌ను ఆర్మూర్ మండలం  అంకాపూర్‌లో శాలువాతో సన్మానించి అభినందించారు.ఈ సందర్భంగా పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో రక్తదాన అవగాహన సదస్సులు, రక్తదాన శిబిరాలు నిర్వహించాలని సూచించారు. యువతతో పాటు రైతులను కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వాములను చేసి, స్వచ్ఛంద రక్తదానంపై చైతన్యపరచాలన్నారు. అత్యవసర సమయాల్లో రక్తం అవసరమైన వారికి సకాలంలో సహాయం అందేలా రెడ్‌క్రాస్ సొసైటీ కృషి చేయాలని పేర్కొన్నారు.రెడ్‌క్రాస్ సేవల విస్తరణకు జాతీయ పసుపు బోర్డు చైర్మన్‌గా, భారతీయ జనతా పార్టీ తరఫున తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని పల్లె గంగారెడ్డి హామీ ఇచ్చారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సహకారం కూడా ఉంటుందని తెలిపారు. రాష్ట్ర కౌన్సిల్ మెంబర్‌గా బాధ్యతలు చేపట్టిన జెస్సు అనిల్‌కుమార్ ప్రజాసేవా కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా తెలిపారు.