telangana
ఘనంగా జడ్పీహెచ్‌ఎస్ పెద్ద కొడపగల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం
సూర్య పెద్ద కొడపగల్: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పెద్ద కొడపగల్‌కు చెందిన 1999–2000 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆత్మీయంగా నిర్వహించారు. ఎన్నో ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్న పూర్వ విద్యార్థులు చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆనందంగా గడిపారు.పాఠశాల రోజుల్లో కలిసి చదువుకున్న స్నేహితులు చాలా కాలం తర్వాత కలుసుకోవడంతో వారి మధ్య ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ, అప్పటి గురువులు, తరగతి గది అనుభవాలు, ఆటపాటలు, మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. విద్యాభ్యాసం అనంతరం వివిధ రంగాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు తమ జీవిత అనుభవాలను పరస్పరం పంచుకున్నారు. పాఠశాలతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, నాటి స్నేహబంధాలను ఎప్పటికీ కొనసాగించాలని ఆకాంక్షించారు.ఈ సమ్మేళనం పూర్వ విద్యార్థుల మధ్య స్నేహాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు, పాత జ్ఞాపకాలను మరోసారి కళ్లముందు నిలిపిందని పలువురు ఆనందం వ్యక్తం చేశారు. ఆత్మీయ పలకరింపులు, నవ్వులు, సరదా సంభాషణలతో ఈ కలయిక ఉత్సాహభరితంగా సాగింది.
ఈ కార్యక్రమంలో హనుమాన్లు, పండరి, మోహన్, బాబు, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు