BREAKING
కంచుకుంటలో పెద్దమ్మ , పోతులయ్య స్వామి విగ్రహ ప్రతిష్ట ఓటరు జాబితా సవరణపై ప్రజల్లో అవగాహన కల్పించాలి పటాన్‌చెరులో బీజేపీ ఆధ్వర్యంలో మేధావుల సమావేశం ఉత్తర నియోజకవర్గం 52వార్డు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కె.కె రాజు ... సీతమ్మ పాత్రలో నటించేముందు ఆ అమ్మవారిని ఎంతగానో ప్రార్థించాను: సాయిపల్లవి భావోద్వేగం! అజయ్ బాబును గెలిపించండి అభివృద్ధి చేసి చూపిస్తా రామచంద్రపురం మున్సిపాలిటీలో వైసిపి ప్రసారం కూటమి ప్రభుత్వం విజయమే లక్ష్యంగా పనిచేయాలి కుందుర్పి లో జోరుగా టిడిపి ఎన్నికల ప్రచారం కాట శ్రీనివాస్ గౌడ్‌కు దసరా శుభాకాంక్షలు తెలిపిన ఇంద్రేశం కౌన్సిలర్ మన్నె లక్ష్మి 'ఆర్ఆర్ఆర్' కంటే 'వారణాసి' ఐదారు రెట్లు పెద్ద సినిమా.. జపాన్ వేదికగా ఎస్.ఎస్. రాజమౌళి సంచలన వ్యాఖ్యలు! పౌర్ణమి ఆదివారం సందర్భంగా శ్రీ భవాని మందిరంలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ప్రత్యేక పూజలు ఓటీటీలో అదరగొడుతున్న 'డోరతీ' సినిమా.. ఇళయరాజా మ్యూజిక్, కార్తీక్ సుబ్బరాజ్ టేకింగ్‌పై ప్రశంసల వర్షం! కోడుమూరు జెడ్పిటిసితో సహా అన్ని ఎంపిటిసిలను గెలుచుకుంటాం :కోట్ల హరి ‘జనవరి 12 విడుదల’ సినిమాకు భారీ ప్రీ-రిలీజ్ బిజినెస్.. వెంకీ, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్‌తో మరో బ్లాక్‌బస్టర్ పక్కా? మల్కాపూర్‌ అసైన్డ్‌ భూములపై అంతుచిక్కని భూసేకరణ వ్యవహారం!

ఎమ్మెల్యే ఆరిమిల్లి జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం తోపాటు పలు సేవా కార్యక్రమాలు.

Select Suryaa Now
ఎమ్మెల్యే ఆరిమిల్లి జన్మదినం సందర్భంగా    రక్తదాన శిబిరం తోపాటు పలు సేవా కార్యక్రమాలు.

తణుకు, సూర్య న్యూస్ :తణుకు ఎమ్మెల్యే,రాష్ట్ర పిఏసి కమిటీ సభ్యులు,జోనల్ కో-ఆర్డినేటర్  ఆరిమిల్లి రాధాకృష్ణ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు సామాజిక సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. ఆదివారం స్థానిక రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంకు ఆవరణలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకోవడంతో పాటు పచ్చదనం పెంపొందించే లక్ష్యంతో మొక్కలు నాటారు. అనంతరం స్వచ్ఛంద రక్తదాన కార్యక్రమం నిర్వహించి సేవా స్ఫూర్తిని చాటుకున్నారు.ఈ సందర్భంగా రెడ్‌క్రాస్ సమన్వయకర్త పెండ్యాల సూర్య మాట్లాడుతూ, ఆపదలో ఉన్నవారికి సకాలంలో రక్తం అందించడం ద్వారా విలువైన ప్రాణాలను కాపాడవచ్చన్నారు. ఒక వ్యక్తి దానం చేసిన రక్తంలోని వివిధ భాగాలు అవసరాన్ని బట్టి ముగ్గురు రోగులకు ఉపయోగపడే అవకాశం ఉందని వివరించారు. ఎమ్మెల్యే రాధాకృష్ణ జన్మదినాన్ని కేవలం వేడుకలకే పరిమితం చేయకుండా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలతో నిర్వహించాలనే ఉద్దేశంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. యువత స్వచ్ఛంద రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పెండ్యాల సూర్య, ఆకుల సునీల్, అల్లం మణికంఠ, కొమ్మర సతీష్, అనగం శ్రీహరి స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.వాకర్స్ సంఘ నాయకులు కోడూరి ఆంజనేయులు, కూటమి నాయకులు చిట్టూరి సాయిబాబా, మేడికొండ నాగయ్య, సప్పా రాజు, కాలే సత్తిబాబు, బొల్లాడ నాగరాజు, రాసాబత్తుల అనుకుమార్, రాకేష్, బడేటి సాయిరాం, సిర్రా బ్రహ్మయ్య, అనిత, ఆకుల వెంకటేష్ తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

రిపోర్టర్. ..అనుకుమార్. ..తణుకు. ..పశ్చిమగోదావరి జిల్లా. ..