కోడుమూరు జెడ్పిటిసితో సహా అన్ని ఎంపిటిసిలను గెలుచుకుంటాం :కోట్ల హరి
కోడుమూరు మండలంలో జడ్పిటిసి స్థానంతో పాటు అన్ని ఎంపిటిసి స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు, మా పార్టీ బలపరిచిన ఉమ్మడి వామపక్ష పార్టీల అభ్యర్థులను గెలిపించుకొని తమ సత్తా ఏమిటో చూపిస్తామని వైసిపి సీఈసీ సభ్యులు, మాజీ జెడ్పిటిసి కోట్ల హరి చక్రపాణి రెడ్డి పునరుద్ఘాటించారు. కోడుమూరు పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కోడుమూరులో అధికార టిడిపి పార్టీ అరాచకాలు,దౌర్జన్యాలు సాగవని ఆయన హెచ్చరించారు. కూటమి పార్టీలకు విడిపోతే ఓడిపోతామని భయం పుట్టించిన వ్యక్తి జగన్ అని ఆయన పేర్కొన్నారు.కూటమి అభ్యర్థులను చిత్తు చిత్తు గా ఒడిస్తామన్నారు.కోడుమూరు పట్టణానికి గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి పైపులైన్ ద్వారా తాగునీటిని అందించిన తర్వాతే ఓటు అడుగుతామని చెప్పిన అధికార టిడిపి నాయకులు ఇప్పుడు ఎలా ఓట్లు అడుగుతారని ఆయన ప్రశ్నించారు. కోడుమూరు తాగునీటి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.38 కోట్ల రూపాయలు మంజూరు చేసిన స్థానిక నాయకత్వం లోపం వల్లే అ నిధులు రద్దు చేశారని ఆయన ఆరోపించారు. సాగు, తాగునీరు రాక ప్రజలు రైతులు అల్లాడిపోతున్నారని, పొలాలకు సాగునీరు అందక బీళ్లుగా మరినాయని ఇలాంటి విపత్కర పరిస్థితి ఎన్నడూ చూడలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కోడుమూరు పట్టణంలో ఐదవ ఎంపిటిసి స్థానానికి సిపిఎం అభ్యర్థిగా నేష.నాగిరెడ్డి, ఆరో ఎంపిటిసి స్థానాన్నికీ సిపిఐ అభ్యర్థిగా బి.రాజు పోటీ చేస్తున్నారని వీరిని వైసీపీ పార్టీ బలపరుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి రాజు, పట్టణ కార్యదర్శి శేషు కుమార్ , సిపిఐ కృష్ణ, ఎయిటియుసీ తాలూకా కార్యదర్శి మద్దూరు చిన్న రాముడు,3వ ఏంపిటిసి అభ్యర్థి కౌలుట్ల, వైసిపి నాయకులు సీతారాం రెడ్డి, అన్వర్ తదితరులు పాల్గొన్నారు.
జెడ్పీటీసీ అభ్యర్థి కోట్ల భానుశ్రీ ని ఆశీర్వదించండి:
కోడుమూరు జెడ్పిటిసి అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న కోట్ల భాను శ్రీని ఆశీర్వదించాలని ఆమె భర్త కోట్ల హరి చక్రపాణి రెడ్డి కోరారు. ఈ మేరకు కోడుమూరులోని కోట్ల హరి చక్రపాణి రెడ్డి పార్టీలకు అతితంగా అత్యంత సన్నిహితంగా ఉన్న కుటుంబాలను కలిసి మద్దతు కోరారు.