BREAKING
మటన్ షాపు వద్ద వృధాగా పోతున్న త్రాగునీరు చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్ 51 వ వార్డు వైసిపి అభ్యర్థి సానబోయిన లలిత కుమారి ఎన్నికల ప్రచారం.. కూటమి అభ్యర్థులను గెలిపించండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు ప్రభాస్ 'ఫౌజీ' గ్లింప్స్‌పై నెట్టింట కొత్త చర్చ.. స్వాతంత్ర్యానికి ముందే ఫిల్టర్ సిగరెట్లా? ఎన్నికల జోరు పెంచిన 46వ వార్డు కూటమి అభ్యర్థి షణ్ముఖేశ్వరి కంచుకుంటలో పెద్దమ్మ , పోతులయ్య స్వామి విగ్రహ ప్రతిష్ట ఓటరు జాబితా సవరణపై ప్రజల్లో అవగాహన కల్పించాలి పటాన్‌చెరులో బీజేపీ ఆధ్వర్యంలో మేధావుల సమావేశం ఉత్తర నియోజకవర్గం 52వార్డు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కె.కె రాజు ... సీతమ్మ పాత్రలో నటించేముందు ఆ అమ్మవారిని ఎంతగానో ప్రార్థించాను: సాయిపల్లవి భావోద్వేగం! అజయ్ బాబును గెలిపించండి అభివృద్ధి చేసి చూపిస్తా రామచంద్రపురం మున్సిపాలిటీలో వైసిపి ప్రసారం కూటమి ప్రభుత్వం విజయమే లక్ష్యంగా పనిచేయాలి కుందుర్పి లో జోరుగా టిడిపి ఎన్నికల ప్రచారం కాట శ్రీనివాస్ గౌడ్‌కు దసరా శుభాకాంక్షలు తెలిపిన ఇంద్రేశం కౌన్సిలర్ మన్నె లక్ష్మి

డిసెంబర్ 2 వరకు పిజిఆర్ఎస్ నిలిపివేత

Select Suryaa Now
డిసెంబర్ 2 వరకు పిజిఆర్ఎస్ నిలిపివేత

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంస్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున తూర్పుగోదావరి జిల్లాలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని డిసెంబరు 2 లేదా ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు, ఏది ముందుగా జరిగితే అప్పటివరకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు, అధికారుల పర్యవేక్షణ, ఎన్నికల విధుల నిర్వహణ తదితర అంశాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా అధికారులు విధులు నిర్వహించాలని, ఎన్నికల ప్రక్రియను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఎన్నికల ప్రక్రియ పూర్తయిన అనంతరం సంబంధిత ఆదేశాల మేరకు పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.