అక్క తప్పకుండ మా ఓట్లు మీకే... -ఆకారం పల్లి ప్రచారంలో ఓటర్లు భరోసా
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : 60వ డివిజన్ పరిధిలో సమస్యలను పరిష్కరించండి అక్క మా ఓట్లు మీకే వేస్తాను అని ఓటర్లు కూటమి తరపున జనసేన కార్పొరేటర్ అభ్యర్థి ఆకేపాటి సుభాషిణికి మహిళలు భరోసా ఇచ్చారు. ఆదివారం అక్కరంపల్లి లోని పలు ప్రాంతాలలో కూటమిటీడీపీ నాయకులు క్లస్టర్ ఇంచార్జ్ బిజికే కృష్ణ యాదవ్, జనసేన నాయకులు కిరణ్ రాయల్, వంశీ గంగుపల్లి, భీమా, హేమ కుమార్, నాయకులతో కలిసి ఆమె ప్రచారం చేశారు. ప్రచారానికి వెళ్లిన ప్రతి ఇంటిలో మహిళలు సాధన స్వాగతం పలికి ఓటు జనసేనకే వేస్తామని భరోసా కల్పించారు. కార్పొరేషన్ ఎన్నికలలో విజయమే లక్ష్యంగా సాగిన ప్రచారం ముమ్మరం చేశారు. జనసేన–టీడీపీ- బీజేపీ కూటమి ఐక్యతతో 60వ డివిజన్ అభివృద్ధే అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె డివిజన్లోని ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంచుతూ నవంబర్ ఒకటో తేదీ జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో మేయర్ అభ్యర్థి జేవి శ్రీనివాస్ కు జనసేన పార్టీ అభ్యర్థి అయిన తనకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు వంశీ గంగుపల్లి, భీమా, హేమ కుమార్, రాధ, దుర్గ, శిరీష, కోకిల, మణిమాల, దివ్య, ప్రవీణ్, జె.కె. రాయల్, ఆది, గోపి, నూనె దిలీప్ రాయల్, రవి, చందన టీడీపీ నాయకులు క్లస్టర్ ఇంచార్జ్ బిజి కే కృష్ణ యాదవ్, ఏమి టిడిపి యూనిట్ ఇంచార్జ్ నరేష్ రెడ్డి, రవి కుమార్, సుశీల, నవోదయ కాలనీ రవి,టిడిపి యూనిట్ ఇంచార్జ్ నరేష్ రెడ్డి, రవి కుమార్, సుశీల, నవోదయ కాలనీ రవి పాల్గొని ప్రచారంలో పాల్గొని మద్దతు తెలిపారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్