మాజీ ఎంపీటీసీ కుమారుడు తేజ రెడ్డి టిడిపిలో చేరిక
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరండాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం జొన్నాడ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ తాడి నాగమోహన్ రెడ్డి కుమారుడు తాడి సత్య మణికంఠ తేజా రెడ్డి అడ్వకేట్ వైసీపీ ని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. తేజ రెడ్డి తాత తాడి సత్యం గ్రామ మాజీ సర్పంచ్ పార్టీలో చేరిన తేజా రెడ్డికి కండువా కప్పి ఎమ్మెల్యే సత్యానందరావు సాదరంగా ఆహ్వానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే సూచించారు.