DHRC కరీంనగర్ జిల్లా నూతన కమిటీ నియామకాలు
సూర్య కరీంనగర్: డెమోక్రటిక్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ (DHRC) కరీంనగర్ జిల్లా నూతన కమిటీ నియామక కార్యక్రమం ఆదివారం కరీంనగర్‌లోని కొత్తిరాంపూర్, గణేష్ నగర్ బైపాస్ రోడ్డులో ఉన్న వసంత్ వ్యాలీ స్కూల్‌లో నిర్వహించారు. జిల్లాలో సంస్థ కార్యకలాపాలను విస్తరించడంతో పాటు మానవ హక్కుల పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ కార్యక్రమానికి DHRC చైర్మన్ ఐలనేని శ్రీనివాస్ రావు, హనుమకొండ టౌన్ ప్రెసిడెంట్ మహిపాల్, కరీంనగర్ టౌన్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్, మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పి.వి. సౌమ్య శ్రీ, కరీంనగర్ యూత్ ప్రెసిడెంట్ ఎం.డి. సాజిద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన జిల్లా కమిటీ బాధ్యులకు నియామక పత్రాలను అందజేశారు.
నూతన కమిటీ వివరాలు:
- జిల్లా అధ్యక్షుడు: ఉర్రెడ్డి ఆనంద్ యాదవ్
- జిల్లా ఉపాధ్యక్షుడు: సాధుల్ హుస్సేన్
- ప్రధాన కార్యదర్శి: ఎం.డి. రఫీ
- వర్కింగ్ ప్రెసిడెంట్: చంద్రమౌళి
- సంయుక్త కార్యదర్శి: ఉరేడి రమేష్ యాదవ్
- ఆర్గనైజింగ్ సెక్రటరీ: శ్రీనివాస్
- న్యాయ సలహాదారు: నీసా
నూతన కమిటీ సభ్యులను నాయకులు అభినందిస్తూ, మానవ హక్కుల పరిరక్షణ, బాధితులకు న్యాయం అందించడం, ప్రజా సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం వంటి అంశాలపై చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. అన్యాయం, హింస, అవినీతికి వ్యతిరేకంగా ప్రజల తరఫున నిలబడి, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
కరీంనగర్ జిల్లావ్యాప్తంగా మానవ హక్కులపై అవగాహన పెంపొందించడం, హక్కుల ఉల్లంఘనకు గురైన బాధితులకు అండగా నిలవడం, సమానత్వం, న్యాయం, మానవ గౌరవం వంటి విలువలను ప్రోత్సహించడం నూతన కమిటీ ప్రధాన లక్ష్యాలని నాయకులు పేర్కొన్నారు. ప్రజాసేవలో భాగంగా సంస్థను మరింత బలోపేతం చేస్తూ, మానవ హక్కుల పరిరక్షణతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.