ప్రీ పరేడ్ కు పియూ విద్యార్థి రాణా ప్రతాప్ ఎంపిక
మహబూబ్ నగర్ పియు సూర్య న్యూస్ -అభినందించిన వీసీ, రిజిస్ట్రార్, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్-
పాలమూరు యూనివర్సిటీ స్థాయి ప్రీ-రిపబ్లిక్ డే ప్రీ-ఆర్ డి పరేడ్ ఎంపికల్లో యూనివర్సిటీ పీజీ కళాశాల ఎం.ఎస్‌డబ్ల్యూ ద్వితీయ సంవత్సరం విద్యార్థి జి. రాణాప్రతాప్ ఎంపికయ్యారు.ఈ సందర్భంగా వీసీ ఆచార్య జి.ఎన్. శ్రీనివాస్ మాట్లాడుతూ, “విద్యార్థులు చదువుతోపాటు ఎన్‌ఎస్‌ఎస్ వంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరచడం అభినందనీయం అన్నారు.క్రమశిక్షణ, సేవాభావంతో ముందుకు సాగి యూనివర్సిటీకి మంచి పేరు తీసుకురావాలి” అని అన్నారు.రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి. రమేష్ బాబు , ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ డా. కె. ప్రవీణ విద్యార్థులను అభినందించారు.
ఓం ప్రకాష్..మహబూబ్ నగర్