BREAKING
రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాల విచారణ 15 రోజుల్లో పూర్తి చేస్తాం ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి టెన్నిస్ కోర్టులో అదరగొట్టిన భారత స్టార్.. కెరీర్‌లో ఐదో ఏటీపీ డబుల్స్ టైటిల్ సాధించిన యూకీ బాంబ్రీ విశేషాలంకరణలో శ్రీకామాక్షి సమేత చంద్రమౌళీశ్వరస్వామి శ్రీనారాయణస్వామి దేవస్థానం ఆదాయం 1,61,150 రూపాయలు ఎన్నికల విధులకు కమర్షియల్ వాహనాలను వాడాలి రెస్లింగ్ పోటీల్లో పోరాడి ఓడిన భారతీయ రెజ్లర్ లలిత్.. తృటిలో చేజారిన కాంస్య పతకం అఫిలియేషన్ విదివిధానాలపై కమిటీ -సమగ్ర అధ్యయన కమిటీలో ఎస్వీయూ రిజిస్ట్రార్ కు చోటు హాళ్లను పరిశీలించిన కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ డూడి మూడో టీ20కి ముందు టీమిండియాను హెచ్చరించిన మోర్నే మోర్కెల్.. వెల్లింగ్టన్ గాలులపై ప్రత్యేక దృష్టి టీడీపీ చైర్మన్ అభ్యర్థి కాకాని అశోక్‌కు విశ్రాంత ఉద్యోగుల సంపూర్ణ మద్దతు. మండపాకలో పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు తణుకు రూరల్ సీఐ డి. వెంకటేశ్వరరావు పర్యవేక్షణ ఓట్లతో ఆశీర్వదించండి అండగా ఉంటా బిజెపి నేత వెంకీ అధికారంలో ఉన్నాం..... అభివృద్ధి మాకే సాధ్యం జన్నారంలో పోలీసుల ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ

ఖమ్మం మేయర్ పదవే లక్ష్యం .. మున్నూరు కాపులకు ఆర్ జె సి కృష్ణ పిలుపు

Select Suryaa Now
ఖమ్మం మేయర్ పదవే లక్ష్యం .. మున్నూరు కాపులకు ఆర్ జె సి కృష్ణ పిలుపు

మున్నూరు కాపులు రాజకీయ శక్తిగా ఎదగాలి

ఖమ్మం మేయర్ పదవే లక్ష్యం

మున్నూరు కాపులకు ఆర్ జె సి కృష్ణ పిలుపు

  ఉమ్మడి ఖమ్మంసూర్యబ్యూరో చీఫ్ :-

​“రాబోయే ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో ఇతర కులాలను కలుపుకొని పోతూ, మేయర్ పదవిని ప్రధాన లక్ష్యంగా చేసుకుని మున్నూరు కాపులను ఒక గొప్ప రాజకీయ శక్తిగా తీర్చిదిద్దాలి” అని ఆర్ జె సి కృష్ణ పిలుపునిచ్చారు. ఆదివారం ఆర్ జే సీ కృష్ణ నివాసంలో  అయన అధ్యక్షతన జరిగిన కొండా దేవయ్య కాపు సంఘం జిల్లా ముఖ్య నాయకుల సమావేశంలో   అయన మాట్లాడారు.కొండా దేవయ్య నాయకత్వంలోని మున్నూరు కాపు సంఘాన్ని అతి త్వరలోనే విస్తృతపరుస్తామని  శెట్టి రంగారావు స్పష్టం చేశారు.
​మాజీ సుడా చైర్మన్ బచ్చు విజయకుమార్ మాట్లాడుతూ.. సంఘం అనేది సరైన నిర్మాణంతో సాగాలని, మున్నూరు కాపుల చరిత్ర తెలియని వారి చేతుల్లోకి వెళ్లకుండా, కేవలం వ్యక్తి ఆరాధనలకు లేదా మూడు కుటుంబాల పాలనకు పరిమితమయ్యే సంస్థగా మారకూడదని అన్నారు.గత పదేళ్లపాటు ఈ సంఘాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని లక్కినేని సుధీర్ ఆవేదన వ్యక్తం చేశారు.
​సంఘం కేవలం ఖమ్మం పట్టణానికే పరిమితం కాకుండా జిల్లావ్యాప్తంగా విస్తరించాలని రాపర్తి శరత్ సూచించగా, సేవా రంగంలోనూ మన సంఘాన్ని ముందు వరుసలో నిలపాలని పొన్నం వెంకటేశ్వర్లు కోరారు. ఈ కార్యక్రమంలో కనిశెట్టి నరసయ్య, సాగర్, పిన్ని కోటేశ్వరరావు, మాటేటి కిరణ్, లక్కినేని సుధీర్ శ్రీదేవి, పసుపులేటి నాగరాజు, ఎర్ర జ్ఞానేశ్, రియల్ ఎస్టేట్ అధ్యక్షుడు వరప్రసాద్, నాలం సతీష్, గుండెపునేని రాజా  తాళ్ళూరి రవి, మేకల శంకర్ బాబు, ఎండిఓ రవి, మూలగుండ్ల శ్రీహరి, కనకం భద్రయ్య, రాగం శ్యామ్, వెన్నపండు శ్రీధర్, మూగల శ్రీను, రావూరి నరసింహారావు, ఉప్పు వెంకటేశ్వర్లు సహా భారీ సంఖ్యలో ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.