BREAKING
మిత్రమా ఎలా ఉన్నావ్.. స్నేహం కోసం... 31 గిన్నస్ ప్రపంచ రికార్డులతో చరిత్ర సృష్టించిన గీతం పూర్వ విద్యార్థిని కేవలం రూ. 2.5 కోట్ల బడ్జెట్.. వంద కోట్ల కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద కన్నడ సినిమా సెన్సేషన్! కరువు మండలంగా ప్రకటించాలి తెలంగాణ రాష్ట్ర యూత్ ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మహబూబ్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న పులిమామిడి రాజు ప్రజల నమ్మకాన్ని గెలిపిస్తాను. కౌన్సిలర్ రామయ్య. మల్లారెడ్డి సేవలు చిరస్మరణీయం 24వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అనాథ పిల్లలకు అన్నదానం రామ్ చరణ్, సుకుమార్ క్రేజీ కాంబో 'RC17' మూవీ లాంచ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే? మనోజ్ బాజ్ పాయ్ కొత్త సినిమా 'గజబ్ రాత్' రివ్యూ.. క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? రైతు కష్టాలు మా కష్టాలే.. అన్నదాతకు ప్రభుత్వం అండగా ఉంటుంది నందికంది గ్రామాన్ని వణికిస్తున్న బ్లూక్రాఫ్ట్ ఆగ్రో కాలుష్యం! వైఎస్సార్‌సీపీ నాయకుడు జగన్ మోహన్‌రెడ్డి మృతికి కాటసాని సంతాపం ఎన్నికల వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి గొడవలకు ఆజ్యం పోసే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు గొడశలపల్లి, కూడ్లూరు గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించిన హీరేహాళ్ ఎస్సై గురు ప్రసాద్ రెడ్డి ప్రత్యేక పూజలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు అయ్యప్ప స్వాముల మహా పాదయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

మైక్రో అబ్జర్వర్లకు ఎన్నికల శిక్షణ.. పోలింగ్ ప్రక్రియను నిశితంగా పరిశీలించాలి కమిషనర్ ఎం. జశ్వంత్ రావు..

Select Suryaa Now
మైక్రో అబ్జర్వర్లకు ఎన్నికల శిక్షణ..   పోలింగ్ ప్రక్రియను నిశితంగా పరిశీలించాలి కమిషనర్ ఎం. జశ్వంత్ రావు..

(అనంతపురము, కార్పొరేషన్ మేజర్ న్యూస్:)

అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలో జరగనున్న రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికలు 2026ను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు మైక్రో అబ్జర్వర్లు కీలక పాత్ర పోషించాలని అదనపు ఎన్నికల అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్ ఎం. జశ్వంత్ రావు సూచించారు.జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అక్టోబర్ 25న ఉదయం 11 గంటలకు అనంతపురం నగరపాలక సంస్థ నూతన కౌన్సిల్ హాలులో మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎల్‌డీఎం శ్రీనివాసులు, నోడల్ అధికారి, జిల్లా రిజిస్ట్రార్ భార్గవ్, అదనపు ఎన్నికల అధికారి, కమిషనర్ ఎం. జశ్వంత్ రావు అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నవంబర్ 1న జరగనున్న పోలింగ్‌కు మైక్రో అబ్జర్వర్లు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని సూచించారు. పోలింగ్ రోజు ఉదయం 6 గంటలకే తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని, బ్యాలెట్ బాక్సు ఖాళీగా ఉన్న విషయాన్ని రాజకీయ పార్టీల ఏజెంట్లకు చూపించి, నిబంధనల ప్రకారం సీల్ చేసే ప్రక్రియను పరిశీలించాలని తెలిపారు.పోలింగ్ సమయంలో ఓటర్ల గుర్తింపు, 17ఏ రిజిస్టర్‌లో సంతకాలు, బ్యాలెట్ పత్రాల జారీ విధానాన్ని నిశితంగా గమనించాలన్నారు. ఓటు రహస్యంగా వేసే హక్కుకు ఎలాంటి భంగం కలగకుండా చూడాలని, పోలింగ్ కేంద్రంలో ఓటర్లను ప్రభావితం చేసే చర్యలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సుల సీలింగ్ ప్రక్రియను పరిశీలించాలని, వాటిని స్ట్రాంగ్ రూమ్‌కు తరలించే వరకు నిబంధనల ప్రకారం పర్యవేక్షించాలని తెలిపారు. దొంగ ఓట్లు, ఇతర ఎన్నికల అక్రమాలు లేదా అవకతవకలు గుర్తించిన వెంటనే జనరల్ అబ్జర్వర్‌కు నివేదించాలని ఆదేశించారు.ఎన్నికల నిర్వహణలో ప్రతి అంశాన్ని బాధ్యతాయుతంగా పరిశీలిస్తూ, నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని మైక్రో అబ్జర్వర్లకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్లు గోవిందరాజులు, రోశయ్య, ఎర్రిస్వామితో పాటు వివిధ బ్యాంకుల నుంచి నియమితులైన మైక్రో అబ్జర్వర్లు పాల్గొన్నారు.