BREAKING
రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాల విచారణ 15 రోజుల్లో పూర్తి చేస్తాం ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి టెన్నిస్ కోర్టులో అదరగొట్టిన భారత స్టార్.. కెరీర్‌లో ఐదో ఏటీపీ డబుల్స్ టైటిల్ సాధించిన యూకీ బాంబ్రీ విశేషాలంకరణలో శ్రీకామాక్షి సమేత చంద్రమౌళీశ్వరస్వామి శ్రీనారాయణస్వామి దేవస్థానం ఆదాయం 1,61,150 రూపాయలు ఎన్నికల విధులకు కమర్షియల్ వాహనాలను వాడాలి రెస్లింగ్ పోటీల్లో పోరాడి ఓడిన భారతీయ రెజ్లర్ లలిత్.. తృటిలో చేజారిన కాంస్య పతకం అఫిలియేషన్ విదివిధానాలపై కమిటీ -సమగ్ర అధ్యయన కమిటీలో ఎస్వీయూ రిజిస్ట్రార్ కు చోటు హాళ్లను పరిశీలించిన కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ డూడి మూడో టీ20కి ముందు టీమిండియాను హెచ్చరించిన మోర్నే మోర్కెల్.. వెల్లింగ్టన్ గాలులపై ప్రత్యేక దృష్టి టీడీపీ చైర్మన్ అభ్యర్థి కాకాని అశోక్‌కు విశ్రాంత ఉద్యోగుల సంపూర్ణ మద్దతు. మండపాకలో పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు తణుకు రూరల్ సీఐ డి. వెంకటేశ్వరరావు పర్యవేక్షణ ఓట్లతో ఆశీర్వదించండి అండగా ఉంటా బిజెపి నేత వెంకీ అధికారంలో ఉన్నాం..... అభివృద్ధి మాకే సాధ్యం జన్నారంలో పోలీసుల ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ

మోకాళ్లపై నిరసన వ్యక్తం చేసిన జాతీయ ఆరోగ్య మిషిన్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు

Select Suryaa Now
మోకాళ్లపై నిరసన వ్యక్తం చేసిన జాతీయ ఆరోగ్య మిషిన్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు
సూర్య కామారెడ్డి జిల్లా ప్రతినిధి : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్దగల ధర్నా చౌక్ లో ఆదివారం జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నిరధిక సమ్మె 13వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వినూత్న నిరసన చేపట్టారు. మోకాళ్ళపై నిలబడి కళ్ళు మూసుకొని ప్రభుత్వానికి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి తాము పడుతున్న గోసను అర్థం చేసుకోవాలని, వెంటనే చర్చలు ప్రారంభించి తమ న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. కాంట్రాక్ట్ హౌసెస్ జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగులు చేపట్టిన సమ్మె శిబిరాన్ని పిఆర్టియు (తెలంగాణ) ఉపాధ్యాయ సంఘం, తెలంగాణ రాజ్యాధికార పార్టీ సందర్శించి సంపూర్ణ మద్దతు తెలిపాయి. పిఆర్టియు జిల్లా అధ్యక్షుడు అంపిరి మనోహర్రావు మాట్లాడుతూ.. తెలంగాణను ఎలాగైతే సాధించుకున్నామో అదే పంథాను కొనసాగించాలని తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఉద్యోగుల సమ్మెను నేరుగారిచే ప్రయత్నం అధికార పక్షాలు చేస్తాయని జాగ్రత్తతో ఉద్యమ పోరాటాన్ని విరమించకుండా ప్రధాన డిమాండ్లు సాధించేవరకు ఏకతాటిపై ఐక్యంగా ఉద్యమించాలని సూచించారు. ఆంగ్లేయులను ఎదిరించడంలో అల్లూరి సీతారామరాజు చేసిన ఉద్యమ మార్గాన్ని కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వివరించారు. అనంతరం తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు తాహెర్ మాట్లాడుతూ.. కొట్టాడు తెచ్చుకున్న తెలంగాణలో సైతం ఉద్యోగులు ఇబ్బందులు పడటం దౌర్భాగ్యకరమైన విషయం అన్నారు. తీన్మార్ మల్లన్న ఎన్హెచ్ఎం ఉద్యోగుల పక్షాన అండగా నిలబడుతూ తెలంగాణ రాష్ట్ర మంతా పర్యటన చేసి జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగుల సమస్యలపై పోరాటం చేస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్, ఎన్ హెచ్ ఎం జేఏసీ జిల్లా అధ్యక్షుడు సుమన్, జేఏసీ నాయకులు అశ్విని, వెంకటరమణ, డా.రాహుల్, డా.మౌనిక , డా.మీనాక్షి, డా.రవళి, సందీప్, అఖిల్ , క్రాంతి, హరినాథ్, చంద్రకాంతం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.