సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి : డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ అదిలాబాద్ వారు సంయుక్తంగా నిర్వహించిన దాడులలో, కొందరు మహారాష్ట్ర నుండి దేశీదారు మద్యమును తీసుకొచ్చి వడ్డెర బస్తీ నందు నిల్వ ఉంచారన్న ఖచ్చితమైన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించగా పట్టణం లోని వడ్డెర బస్తీ కి చెందిన మక్కల సుజాతకు చెందిన ఇంట్లో 36,000/- విలువ కల్గిన 90 మీ. లీ పరిమాణం గల (81) లీటర్లు గల (900) దేశీదారు మద్యం బాటిళ్ళను పట్టుకొని మరియు అదే వడ్డెర బస్తీ నుండి ఇందిరానగర్ వెళ్ళు దారిలో వాహనాలను తనిఖీలు నిర్వహించగా అదే వడ్డెర బస్తీ కి చెందిన దారంగుల గణేష్ కారులో మారుతీ సుజుకి స్విఫ్ట్ డెజిరే సుమారు 96,000/- విలువ కల్గిన 90 మీ. లీ పరిమాణం గల (216) లీటర్లు గల (2400) దేశీదారు మద్యం బాటిళ్ళను,రవాణా చేస్తుండగా కారుతోపాటు పట్టుకున్నట్లు అదిలాబాద్ ఎక్సైజ్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆకుల శ్రీనివాస్ ఒక ప్రకటన లో తెలిపారు, సదరు ఇద్దరు వ్యక్తుల పై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.ఈ దాడులలో అదిలాబాద్ ఎక్సైజ్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆకుల శ్రీనివాస్ మరియు దేవేందర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ (ట్రైనీ) మరియు డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ అదిలాబాద్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రావణ్ కుమార్ మరియు సిబ్బంది కృష్ణ, శివ కుమార్, మధు, నరేష్, బీరయ్య, హరీష్, విజయ లక్ష్మీ పాల్గొన్నారు.ఎవరైనా దేశీదారు మద్యం రవాణా మరియు విక్రయాలు జరిపితే కేసులు నమోదు చేసి జైలుకు తరలిస్తామని ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆకుల శ్రీనివాస్ తెలిపారు.