జామి మండలంలో వైసీపీ నుంచి.. టీడీపీలోకి భారీ చేరికలు..*
విజయనగరం మేజర్ న్యూస్
గజపతినగరం నియోజకవర్గం జామి మండలంలో వైసీపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. వైసీపీని వీడి టీడీపీలోకి వలసలు జోరుగా సాగుతున్నాయి. జామి మండలం ఎం.కొత్తవలస, అట్టాడ గ్రామాలకు చెందిన 90 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఎం.కొత్తవలస గ్రామం నుంచి 60 కుటుంబాలు, అట్టాడ గ్రామం నుంచి 30 కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి.
విజయనగరంలోని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కార్యాలయం వద్ద ఈ చేరికల కార్యక్రమం ఘనంగా జరిగింది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. స్థానిక సంస్థల ఎన్నికల సమీపిస్తున్న వేళ జామి మండలంలో జరుగుతున్న ఈ భారీ చేరికలతో టీడీపీకి మరింత బలం చేకూరుస్తాం మా వంతు పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తామని చెబుతున్న కొత్తగా జాయిన్ అయిన కుటుంబాలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు మరియు మండల పార్టీ అధ్యక్షులు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ప్రజలు స్వచ్ఛందంగా టీడీపీలోకి వస్తున్నారని అన్నారు. పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం, ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జామి మండల టీడీపీ అధ్యక్షుడు పోలిపర్తి స్వామినాయుడు, నాయకులు సారిక మహేష్, మట్టా జనార్ధన్, పొట్టిపిరెడ్డి ఎర్రినాయుడు, తదితర మండల నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
శ్రీనివాస్ బ్యూరో విజయనగరం