విద్యతోనే సమాజంలో నిజమైన మార్పు – బొండాడ రాఘవేంద్రరావు 160 మంది విద్యార్థులకు రూ.15 లక్షల స్కాలర్‌షిప్‌లు పంపిణీ
అవనిగడ్డ, మేజర్ న్యూస్: విద్యతోనే సమాజంలో నిజమైన మార్పు, ఉన్నతి సాధ్యమవుతాయని బొండాడ గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బొండాడ రాఘవేంద్రరావు అన్నారు. ఆర్థిక పరిస్థితులు విద్యార్థుల ప్రతిభకు ఆటంకం కాకూడదనే లక్ష్యంతో తమ మాతృమూర్తి బొండాడ నిర్మలావతి జ్ఞాపకార్థం స్కాలర్‌షిప్‌లు అందిస్తున్నట్లు తెలిపారు.
అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో ఆదివారం బొండాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బొండాడ నిర్మలావతి స్కాలర్‌షిప్–2026 పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పదో తరగతి నుంచి పీజీ వరకు చదువుతున్న సుమారు 160 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు రూ.15 లక్షల విలువైన స్కాలర్‌షిప్‌లను అందజేశారు.
విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని, భవిష్యత్తులో సమాజానికి సేవ చేయాలని రాఘవేంద్రరావు పిలుపునిచ్చారు. యువత ప్రతిభను ప్రోత్సహించి, వారి భవిష్యత్తుకు బాటలు వేసేందుకు బొండాడ ఫౌండేషన్ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని స్పష్టం చేశారు.
ఫౌండేషన్ చైర్‌పర్సన్ బొండాడ నీలిమ, విజయవాడ రాయల్ ట్రస్ట్ చైర్మన్ సీతాలం రాంబాబు ఎస్‌వీఎల్ కళాశాల అధినేత దుట్టా ఉమామహేశ్వరరావు, గొర్రెపాటి చందు, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. స్కాలర్‌షిప్‌లు అందుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.✍️ అజంతా శ్రీనివాస్, అవనిగడ్డ, కృష్ణాజిల్లా.