బిసి సబ్ ప్లాన్ కు ప్రత్యేక చట్టం కావాలి
మహబూబ్ నగర్ సూర్య న్యూస్ -
జనాభా దామాషా ప్రకారం బీసీలకు నిధులు కేటాయించాలి!
బీసీ సమాజ్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం..
బీసీల సమగ్ర అభివృద్ధి, ఆర్థిక సాధికారత, విద్యా, ఉపాధి అవకాశాల కల్పన కోసం బీసీ సబ్‌ప్లాన్‌కు ప్రత్యేక చట్టం తీసుకురావాలని, బీసీ జనాభా దామాషా ప్రకారం బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని ఈ రోజు బీసీ సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలుగురు బీసీ సంఘ నాయకులు డిమాండ్ చేశారు.ప్రెస్ క్లబ్ మెట్టుగడ్డ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో బీసీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు సంగెం సూర్యారావు మాట్లాడుతూ ,రాష్ట్ర జనాభాలో బీసీలు గణనీయమైన సంఖ్యలో ఉన్నప్పటికీ, వారి సామాజిక, ఆర్థిక అభివృద్ధికి అవసరమైన నిధులు జనాభా నిష్పత్తికి అనుగుణంగా కేటాయించబడేలా చట్టబద్ధమైన వ్యవస్థ ఉండాలని కోరుతూ
బీసీ సబ్‌ప్లాన్‌కు ప్రత్యేక చట్టం తీసుకువచ్చి, నిధుల కేటాయింపుకు చట్టబద్ధమైన హామీ కల్పించాలని
బీసీ జనాభా దామాషా ప్రకారం రాష్ట్ర బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించాలని
కేటాయించిన నిధులు ఇతర పథకాలకు మళ్లించకుండా పటిష్టమైన చట్టపరమైన నిబంధనలు రూపొందించాలన్నారు..
వివిధ కుల సంఘాల నాయకులు మాట్లాడుతూ విద్య, వైద్యం, ఉపాధి, స్వయం ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారత, వృత్తిదారుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ
ప్రతి శాఖలో బీసీల కోసం కేటాయించిన నిధులు, వాటి ఖర్చుల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలనీ కోరారు.బీసీల అభివృద్ధికి చట్టబద్ధమైన నిధుల వ్యవస్థ అవసరం అని
బీసీల అభివృద్ధి కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, నిర్దిష్ట బడ్జెట్ కేటాయింపులు, పారదర్శకమైన నిధుల వినియోగం, నిరంతర పర్యవేక్షణతో కూడిన చట్టబద్ధమైన వ్యవస్థ ద్వారా సాధ్యమవుతుందని సమావేశం పేర్కొంది.ప్రభుత్వం ఈ డిమాండ్లపై సానుకూలంగా స్పందించి, బీసీ సబ్‌ప్లాన్‌కు ప్రత్యేక చట్టం రూపొందించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని సమావేశం డిమాండ్ చేసింది.బీసీలకు జనాభా దామాషా ప్రకారం నిధుల కేటాయింపు జరిగేలా బీసీ సంఘాలన్నీ ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చింది.
ఈ కార్యక్రమంలో బీసీ సమాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోడల శ్రీనివాస్ సాగర్, బీసీ సమాజ్ గౌరవ అధ్యక్షుడు శివార్చక విజయ కుమార్, బీసీ సమాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు విజయరాజు, తెలంగాణ టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు జుర్రు నారాయణ యాదవ్, బీసీ జేఏసీ నాయకులు సారంగి లక్ష్మి కాంత్, బెక్కం జనార్ధన్, కుమ్మరి సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు బుగ్గన్న, జాండ్ర సంఘం మాజీ జిల్లా అధ్యక్షుడు మహేందర్,బీసీ సమాజ్ యూత్ ప్రెసిడెంట్ పాలమూరు వెంకటేష్ గౌడ్, బీసీ సమాజ్ పట్టణ అధ్యక్షుడు నరసింహ, నాయకులు బాను ప్రకాష్, మెట్టుకాడి.ప్రభాకర్, వివిధ కుల సంఘ నాయకులు రాజ్ కుమార్, మేదరి ఆంజనేయులు, భీంపల్లి శ్రీకాంత్, నడిమింటి శ్రీనివాసులు, పాండురంగం యాదవ్, పిల్లి సూర్యనారాయణ, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
ఓం ప్రకాష్..మహబూబ్ నగర్