BREAKING
వసుధైవ కుటుంబకం కేవలం నినాదం కాదు, ఆచరణలో చూపుతున్నాం కూరగాయల సాగుతో రైతులకు అధిక ఆదాయం - ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ స్వతంత్ర సమరయోధుడు భాయ్ పరమానంద్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఘన నివాళి ఘనంగా జడ్పీహెచ్‌ఎస్ పెద్ద కొడపగల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ప్రఖ్యాత చిత్రకారుడు జోగెన్ చౌధరి కన్నుమూత బూత్‌ స్థాయి నుంచే బీజేపీని బలోపేతం చేయాలి - బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక సమావేశం ఇంచార్జ్ మంత్రి టీజీ భరత్, మంత్రి పయ్యావుల కేశవ్‌తో భేటీ సమావేశంలో పాల్గొన్న కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల తుది జాబితా విడుదల. ఫ్రాన్స్‌లో మళ్లీ రాజుకుంటున్న నిరసనల సెగ 44వ డివిజన్ లో కూటమి విస్తృత ప్రచారం.. స్థానిక ప్రజలతో మమేకమైన జనసేన జిల్లా అధ్యక్షులు వరుణ్, కూటమి మేయర్ అభ్యర్థి అజేష్ యాదవ్, కార్పొరేటర్ అభ్యర్థి పొదిలి బాబురావు డిసెంబర్ 2 వరకు పిజిఆర్ఎస్ నిలిపివేత ఎమ్మెల్యే ఆరిమిల్లి జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం తోపాటు పలు సేవా కార్యక్రమాలు. అనంత ఆంజనేయస్వామి ఆలయంలో స్వచ్ఛ భారత్ ముస్తాబాద్‌లో శృతి మించుతున్న డీజే సౌండ్! ‘ఇడుపు కాయితం’లో బాలనటిగా ప్రముఖ నిర్మాత కూతురు.. వెండితెరకు పరిచయమవుతున్న చిన్నారి!

తవక్కల్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి. • మంత్రి వివేక్‌, ఎంపీ వంశీకృష్ణకు AISB ఫిర్యాదు

Select Suryaa Now
తవక్కల్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి. • మంత్రి వివేక్‌, ఎంపీ వంశీకృష్ణకు AISB ఫిర్యాదు

సూర్య, మంచిర్యాల టౌన్ : దసరా సెలవుల్లోనూ పాఠశాలలు నిర్వహించడంతో పాటు, ప్రశ్నించిన వారిపై దురుసుగా ప్రవర్తించి, తప్పుడు కేసులు పెట్టించారంటూ తవక్కల్ విద్యాసంస్థల యాజమాన్యంపై AISB నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్‌ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు వినతిపత్రాలు అందజేసినట్లు AISB జిల్లా ప్రధాన కార్యదర్శి కనుకుంట్ల సన్నీ గౌడ్ తెలిపారు.

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం దసరా సెలవుల్లో పాఠశాలలు నిర్వహించకూడదని స్పష్టం చేసినప్పటికీ, నిబంధనలకు విరుద్ధంగా తవక్కల్ విద్యాసంస్థలను నడిపించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రశ్నించేందుకు వెళ్లిన వారిపై దుర్భాషలాడటంతో పాటు, భౌతిక దాడులకు పాల్పడి, తప్పుడు కేసులు పెట్టించారని ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీ, మంత్రి, ఎంపీల పేర్లను ప్రస్తావిస్తూ అజమాయిషీ చెలాయిస్తున్నారని ఆరోపించిన AISB నాయకులు, సదరు వ్యక్తిపై పార్టీ పరంగా క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘించిన పాఠశాలలపై విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, అవసరమైతే పాఠశాలలను మూసివేయాలని విజ్ఞప్తి చేశారు.