గంగానమ్మ అన్నసమారాధనకు పోటెత్తిన భక్తులు
జంగారెడ్డిగూడెం-మేజర్ న్యూస్ పట్టణంలోని గ్రామదేవత శ్రీ గంగానమ్మ అమ్మవారి దసరా నవరాత్రులు ముగిసిన సందర్భంగా ఆదివారం ఆలయ ప్రాంగణంలో భారీ అన్నసమారాధన నిర్వహించారు.15 వేల మందికి పైగా భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు.ఈ సందర్భంగా లలిత సూర్య స్వీట్స్‌కు చెందిన ఆకుల రామచంద్రరావు సమర్పించిన 116 కిలోల డ్రైఫ్రూట్స్ లడ్డూను నడిపల్లి అంజనరావు రూ.2.15 లక్షలకు దక్కించుకున్నారు. భక్తాంజనేయ స్వీట్స్‌కు చెందిన గుబ్బల రాంబాబు అందించిన 109 కిలోల లడ్డూను ఆడిటర్ వీరేంద్ర రూ.1.12 లక్షలకు కైవసం చేసుకున్నారు. ఈకార్యక్రమంలో జెట్టి గురునాథరావు, పరిమి సత్తిపండు, వందనపు వెంకటేశ్వరరావు, పెనుమర్తి రాంకుమార్, తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఆలయ ఛైర్మన్ కలగర వీర్రాజు అన్నసమారాధనకు సహకరించిన పోలీసు శాఖ, మున్సిపల్ సిబ్బంది, పత్రికా ప్రతినిధులు, దాతలు, గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
రిపోర్టర్ కెవి రమణారావు జంగారెడ్డిగూడెం ఏలూరు జిల్లా