BREAKING
ప్రొద్దుటూరు అభివృద్ధికి అదనపు నిధులు త్వరలో అభివృద్ధి పనులు పూర్తి చేస్తాం: ప్రభుత్వ విప్ ఆదినారాయణరెడ్డి 35వ డివిజన్‌లో బంగి నాగకు ఓటర్ల ఆత్మీయ స్వాగతం.. మాజీ మేయర్ స్వరూపాకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికిన స్థానికులు.. మాజీ ఎంపీటీసీ కుమారుడు తేజ రెడ్డి టిడిపిలో చేరిక విద్యతోనే సమాజంలో నిజమైన మార్పు – బొండాడ రాఘవేంద్రరావు 160 మంది విద్యార్థులకు రూ.15 లక్షల స్కాలర్‌షిప్‌లు పంపిణీ జామి మండలంలో వైసీపీ నుంచి.. టీడీపీలోకి భారీ చేరికలు..* దీపావళి వేడుకల్లో అదరగొట్టిన ఆయుష్మాన్ ఖురానా, రాజ్‌కుమార్ రావు.. కరణ్ జోహార్, భూమి పెడ్నేకర్ సందడి! ఆపదలో అండగా స్పీకర్.. మహేశ్వరి వైద్యానికి రూ.2.50 లక్షల సాయం ర్యాలీ జగన్మోహిని కేశవ స్వామి ఆలయంలో నిర్వహించే అన్నదాన పథకానికి విరాళాలు రక్తదాతలకు ఎస్ఐ చేయూత మైక్రో అబ్జర్వర్లకు ఎన్నికల శిక్షణ.. పోలింగ్ ప్రక్రియను నిశితంగా పరిశీలించాలి కమిషనర్ ఎం. జశ్వంత్ రావు.. ఇంద్రవెల్లి సంకల్ప సభకు తెలంగాణ రక్షణ సేన సన్నద్ధం రెడ్‌క్రాస్ సేవల విస్తరణకు అండగా ఉంటాం - పల్లె గంగారెడ్డి బిగ్‌బాస్ 20 నుంచి మేరీ కోమ్ ఎవిక్షన్.. తోటి కంటెస్టెంట్లతో భావోద్వేగ వీడ్కోలు! ఖమ్మం మేయర్ పదవే లక్ష్యం .. మున్నూరు కాపులకు ఆర్ జె సి కృష్ణ పిలుపు మోకాళ్లపై నిరసన వ్యక్తం చేసిన జాతీయ ఆరోగ్య మిషిన్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు

మానకొండూరు మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం

Select Suryaa Now
మానకొండూరు మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం

సూర్య - మానకొండూరు: వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ముందుగా మానకొండూర్ చెరువుకట్ట వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఆకుల నరసన్నలతో కలసి నూతన పాలక వర్గం పూలమాలలు వేసి నివాళులర్పించింది. అనంతరం అక్కడి నుంచి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా మార్కెట్ యార్డ్‌కు చేరుకున్నారు.అనంతరం మార్కెట్ యార్డ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మానకొండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ రెవెల్లి రాజలింగం, వైస్ చైర్మన్ రేమిడీ శ్రీనివాస్ రెడ్డిలతో పాటు డైరెక్టర్ల చేత డిఎంఓ షాబుద్దీన్, ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు సంక్షేమానికే ప్రథమ ప్రాధాన్యత ఇస్తోందన్నారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ మార్కెట్ కమిటీ పాలకవర్గంలో అన్ని వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించామని పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే రూ. 2 లక్షల వరకు రైతు రుణమాఫీని ఏకకాలంలో విజయవంతంగా అమలు చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని గుర్తుచేశారు.గతంలో వై.ఎస్. రాజశేఖరరెడ్డి హయాంలో ఉచిత విద్యుత్‌పై తొలి సంతకం చేసి రైతులకు ఆసరాగా నిలిచారని, నేడు రేవంత్ రెడ్డి  నాయకత్వంలో రైతులకు ఉచిత విద్యుత్, సబ్సిడీ పరికరాలు, ఎరువులు, విత్తనాలను సకాలంలో అందిస్తున్నామని ఎమ్మెల్యే వివరించారు. ఐకేపీ, ప్యాక్స్ కేంద్రాల ద్వారా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి, ధాన్యం సేకరించిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సన్న వడ్లకు మద్దతు ధరతో పాటు అదనంగా రూ. 500 బోనస్ అందిస్తున్నామని, మిల్లర్లు కూడా మంచి ధరకే కొనుగోలు చేస్తున్నారని అన్నారు.సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల కష్టాలను స్వయంగా ఎరిగిన వారని, రైతును రాజు చేయడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారని తెలిపారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మార్కెట్ కమిటీ పాలకవర్గం రైతుల సంక్షేమానికి, మార్కెట్ కమిటీ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ విజయ్ కుమార్, మండల అధ్యక్షులు ద్యావ శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తాళ్లపల్లి సంపత్ గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు  దూలం వీరస్వామి గౌడ్, ముక్కెర సతీష్ కుమార్, తమ్మిశెట్టి రాజేష్,ఎ. కవిత,రామినేని రమణ, కనకం అశోక్, రాపాక రాజేశ్వర్, కుంబం చిరంజీవి, కొత్తిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మందల సంపత్ రెడ్డి, ఎరవేణి రామాంజనేయులు, వి. వీరకుమార్,స్థానిక ప్రజాప్రతినిధులు, ఆయా గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు...