BREAKING
ప్రొద్దుటూరు అభివృద్ధికి అదనపు నిధులు త్వరలో అభివృద్ధి పనులు పూర్తి చేస్తాం: ప్రభుత్వ విప్ ఆదినారాయణరెడ్డి 35వ డివిజన్‌లో బంగి నాగకు ఓటర్ల ఆత్మీయ స్వాగతం.. మాజీ మేయర్ స్వరూపాకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికిన స్థానికులు.. మాజీ ఎంపీటీసీ కుమారుడు తేజ రెడ్డి టిడిపిలో చేరిక విద్యతోనే సమాజంలో నిజమైన మార్పు – బొండాడ రాఘవేంద్రరావు 160 మంది విద్యార్థులకు రూ.15 లక్షల స్కాలర్‌షిప్‌లు పంపిణీ జామి మండలంలో వైసీపీ నుంచి.. టీడీపీలోకి భారీ చేరికలు..* దీపావళి వేడుకల్లో అదరగొట్టిన ఆయుష్మాన్ ఖురానా, రాజ్‌కుమార్ రావు.. కరణ్ జోహార్, భూమి పెడ్నేకర్ సందడి! ఆపదలో అండగా స్పీకర్.. మహేశ్వరి వైద్యానికి రూ.2.50 లక్షల సాయం ర్యాలీ జగన్మోహిని కేశవ స్వామి ఆలయంలో నిర్వహించే అన్నదాన పథకానికి విరాళాలు రక్తదాతలకు ఎస్ఐ చేయూత మైక్రో అబ్జర్వర్లకు ఎన్నికల శిక్షణ.. పోలింగ్ ప్రక్రియను నిశితంగా పరిశీలించాలి కమిషనర్ ఎం. జశ్వంత్ రావు.. ఇంద్రవెల్లి సంకల్ప సభకు తెలంగాణ రక్షణ సేన సన్నద్ధం రెడ్‌క్రాస్ సేవల విస్తరణకు అండగా ఉంటాం - పల్లె గంగారెడ్డి బిగ్‌బాస్ 20 నుంచి మేరీ కోమ్ ఎవిక్షన్.. తోటి కంటెస్టెంట్లతో భావోద్వేగ వీడ్కోలు! ఖమ్మం మేయర్ పదవే లక్ష్యం .. మున్నూరు కాపులకు ఆర్ జె సి కృష్ణ పిలుపు మోకాళ్లపై నిరసన వ్యక్తం చేసిన జాతీయ ఆరోగ్య మిషిన్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు

అభివృద్ధి కోసం.. కూటమికి పురపాలన అందించండి.. ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి

Select Suryaa Now
అభివృద్ధి కోసం.. కూటమికి పురపాలన అందించండి.. ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి

 ఎమ్మిగనూరు సూర్య ప్రతినిధి ;పట్టణ ప్రజలందరూ ఆలోచించి అభివృద్ధి కోసం పురపాలనలో కూటమి పాలకులను ఎన్నుకొని ఓటు వేయాలని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని 12 13 14 15 16 17 వార్డులలో విస్తృతంగా పర్యటించారు. కూటమి తరపున నిలబడిన అభ్యర్థుల గెలుపు కోసం ముమ్మర ప్రచారం చేశారు. గత ఐదేళ్ల పాలనలో కొంటుబడిన అభివృద్ధిని పరుగులు పెట్టించాలంటే కూటమి అభ్యర్థుల గెలుపు కచ్చితంగా ఉండాలని ప్రతి ఓటరు తమ అమూల్యమైన ఓటును కూటమి అభ్యర్థుల గుర్తులకు వేయాలన్నారు. ఎమ్మిగనూరులో తన తండ్రి  బీవీ మోహన్ రెడ్డి ఆశయ సాధన కోసం తన పాలన కొనసాగిస్తున్నానన్నారు. రాబోయే రోజుల్లో ఎమ్మిగనూరు పట్టణానికి కాకుండా నియోజకవర్గం అంతట అభివృద్ధి, సంక్షేమంతో దూసుకుపోవడం జరుగుతుందన్నారు. పట్టణంలో ఉన్న సమస్యలన్నింటికీ పరిష్కారం మార్గం చూపుతామన్నారు. రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం  తోపాటు తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టడం జరిగింది అన్నారు మన చైర్మన్ అభ్యర్థి మాచాని సునీత భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. అలాగే కౌన్సిల్ సభ్యులను కూడా గెలిపించి మున్సిపల్ కు పంపాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ టిడిపి అధ్యక్షులు మాచాని మహేష్ తోపాటు కౌన్సిల్ అభ్యర్థులు, టిడిపి నాయకులు కార్యకర్తలు జనసేన నాయకులు బిజెపి నాయకులు పాల్గొన్నారు.
రాజా శరత్ కుమార్,
సూర్య ప్రతినిధి, ఎమ్మిగనూరు కర్నూలు జిల్లా