అవకాశం ఇవ్వండి...మార్పు చూపిస్తా -కార్పొరేటర్ అభ్యర్థి రాజారెడ్డి అభ్యర్థన
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : 58వ డివిజన్ పరిధిలోని ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసి చూపిస్తాను, అవకాశం ఇవ్వాలని ఆ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి జనసేన నగర అధ్యక్షుడు రాజారెడ్డి ఓటర్లను అభ్యర్థించారు. ఈ మేరకు ఆదివారం చింతల చేను, టెంపుల్ టౌన్, డివిఆర్ హాస్పిటల్ రోడ్డు ప్రాంతాలలో ఆయన జనసేన పార్టీ నాయకులుతో కలిసి ముమ్మరంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కరపత్రాలను ఇంటింటికి పంచుతూ కూటమి చేసిన అభివృద్ధిని వివరిస్తూ నవంబర్ ఒకటో తేదీన జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మేయర్ అభ్యర్థి జేవి శ్రీనివాస్ కు సైకిల్ గుర్తుపై ఓటు వేసి, 58వ డివిజన్ కార్పొరేట్ అభ్యర్థిగా తనకు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీని అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు యువత మహిళలు ఆయనకు సాగర స్వాగతం పలికి మున్సిపల్ ఎన్నికలలో జనసేన పార్టీకి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ప్రజల ప్రతి సమస్యను తన సమస్యగా తీసుకొని తనవంతుగా అభివృద్ధితో పాటు సమస్యల లేని డివిజన్ గా చేయడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు హేమకుమార్, సుమన్, సాయి, పురుషోత్తం, హేమంత్, బిజెపి నవీన్, వీర మహిళలు చందన, దుర్గా, టిడిపి నాయకులు పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్