సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి : సీనియర్ జర్నలిస్ట్ కలాల అభిలాష్ తండ్రి కలాల హనుమన్లు ఇటీవల మరణించడంతో, ఈరోజు నిర్వహించిన పెద్దకర్మ కార్యక్రమానికి టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ వైస్ చైర్మన్ దుర్గం శేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా హనుమన్లు చిత్రపటానికి పూలమాలలు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పారమర్శించి మనోధైర్యాన్ని ఇచ్చారు, హనుమాన్లు ఆసుపత్రి లో ఉన్న సమయంలో వైద్యులు అందించిన వైద్యం చికత్స గురించి అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణ ఎస్సీ డిపార్ట్‌మెంట్ అధ్యక్షులు చంద్రాల రాహుల్, జిల్లా మీడియా కోఆర్డినేటర్ మేకల జితేందర్, సామాజిక కార్యకర్త బండారి దేవన్న, పట్టణ కార్యదర్శి లింగంపల్లి నర్సింలు, ఆడే రఘు తదితరులు పాల్గొని హనుమన్లుకి శ్రద్ధాంజలి ఘటించారు.