BREAKING
65 వ వార్డు టిడిపి అభ్యర్థి సుగుణమని హోరెత్తించిన ఎన్నికల ప్రచారం ప్రాంతీయ సంగీతానికి భాషా భేదాలు, సరిహద్దులు ఉండకూడదు: ప్రముఖ గాయని ఇషానీ దేవ్! నాలుగో పట్టణ పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు వైద్య సహాయం కోసం సీఎంఆర్ఎఫ్ ఎంతో భరోసా ఇస్నాపూర్‌ కూడలిలో ఎనిమిదేళ్ల బాలిక గుర్తింపు గాజువాకలో ప్రచార వాహనాల తనిఖీ స్వతంత్ర అభ్యర్థి 48 వ వార్డు కోయిలడ సూర్య కళ ఎన్నికల ప్రచారం ఔత్సాహిక నటీనటులకు సువర్ణావకాశం.. శ్రీరామ్ 'రామభద్రుడు' సినిమా కాస్టింగ్ కాల్ వివరాలు ఇవే! గంగిపల్లిలో ఘనంగా ర్యాలీ.. మానకొండూరు AMC డైరెక్టర్‌గా ముక్కెర సతీష్ ప్రమాణస్వీకారం జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు కేటాయించాలి. పెందుర్తిలో 'జన' సునామీ: జనసేన గూటికి రాజయ్యపేట ఎంపీటీసీ అభ్యర్థి ఎర్ర ఈశ్వరరావు! నీటి కుంటలో పడి ముగ్గురు మృతి.. మంచిర్యాల జిల్లాలో విషాదం ప్రశాంత ఎన్నికలే లక్ష్యం.. దువ్వాడలో పోలీసుల ఫ్లాగ్‌మార్చ్‌ వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి. రేపు భూముల రీసర్వేపై గ్రామసభ

ప్రజాసేవ లక్ష్యం... -54వ డివిజన్ లో బోయళ్ళ శాంతి

Select Suryaa Now
ప్రజాసేవ లక్ష్యం... -54వ డివిజన్ లో బోయళ్ళ శాంతి

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : ప్రజాసేవే లక్ష్యంగా డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని, రానున్న ఎన్నికలలో కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున 54వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా తనను ఆదరించి గెలిపించాలని ఆ డివిజన్ అభ్యర్థి బోయళ్ళ శాంతి విజ్ఞప్తి చేశారు. 54వ డివిజన్ పరిధిలోని రాయల్ వారి వీధిలో ఆదివారం ఇంటింట ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నవంబర్ ఒకటో తేదీ జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కూటమి తరపున మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జెబి శ్రీనివాస్ కు సైకిల్ గుర్తుపై, కూటమి తరపున 54వ డివిజన్ కార్పొరేటర్ గా పోటీ చేస్తున్న తనను అఖండ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రచారానికి వెళ్లిన బోయళ్ళ శాంతి ఆ ప్రాంత ప్రజలు బ్రహ్మరథం పట్టి ఆహ్వానించారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకుని ఆయా ప్రాంతాల్లో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నిత్యం డివిజన్లో  అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ నిరంతరం కృషి చేస్తానని ఆమె స్పష్టం చేశారు. డివిజన్లోని ప్రజలు అండగా ఉంటామని ఆమెకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు అక్కిపల్లి లక్ష్మయ్య,మధుసూదన్, డిష్ హరి, పురుషోత్తం, ప్రమీలమ్మ, సుధాకర్ రావు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్