BREAKING
కూటమితోనే నగరాభివృద్ధి సాధ్యం... -అరుణోదయ నగర్ ప్రచారంలో అన్నా మల్లీశ్వరి ఫీజుల పేరుతో బీఈడీ ప్రవేశాలు నిరాకరించడమా...! నేటి రాశి ఫలాలు –27 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 27 అక్టోబర్ 2026 ఆర్నబ్ తుఫాన్‌పై అప్రమత్తంగా ఉండాలి.. అగ్రిస్టాక్‌పై జిల్లాస్థాయి టాస్క్‌ఫోర్స్.. రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలి కృష్ణా జిల్లా సాధారణ పరిశీలకునిగా వి. అభిషేక్ నియామకం అవినీతి నిర్మూలనలో ప్రజలు భాగస్వాములు కావాలి ఎన్నికల తనిఖీల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు విద్యుత్ బకాయిల వసూళ్ల ప్రక్రియ వేగవంతం చేయాలి మానవత్వాన్ని చాటుకున్న దామర ఎస్సై ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్ల పరిశీలన... - లయోలా కళాశాలలో స్ట్రాంగ్ రూమ్ తనిఖీ నేడు ఆర్టీసీ డయల్ యువర్ డిఎం ఫొటో ఓటర్ స్లిప్పు తప్పనిసరి కాదు.. : కమిషనర్ ధ్యానచంద్ర స్పష్టీకరణ

పూసల సంఘం భవన నిర్మాణానికి ఎంపీ నిధులు కేటాయిస్తా.. బోర్‌వెల్ వేయిస్తా: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

Select Suryaa Now
పూసల సంఘం భవన నిర్మాణానికి ఎంపీ నిధులు కేటాయిస్తా.. బోర్‌వెల్ వేయిస్తా: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

 

సూర్య పెద్దపల్లి ప్రతినిధి 

పూసల సంఘం భవన నిర్మాణానికి ఎంపీ నిధుల నుంచి అవసరమైన నిధులు కేటాయించేందుకు కృషి చేస్తానని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ హామీ ఇచ్చారు. సంఘం అవసరాల మేరకు బోర్‌వెల్ కూడా వేయిస్తానని తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సిరి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన పూసల సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కుమారస్వామితో పాటు కార్యవర్గ సభ్యులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సంఘం ప్రతినిధులతో సమావేశమైన ఎంపీ, సంఘం అభివృద్ధి, సభ్యుల సంక్షేమం, భవన నిర్మాణానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. గతంలో పూసల సంఘం భవన నిర్మాణం కోసం ప్రతినిధులు చేసిన విజ్ఞప్తిని గుర్తుచేసుకుంటూ, భవన నిర్మాణానికి ఎంపీ నిధుల నుంచి అవసరమైన నిధులు కేటాయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే సంఘం అవసరాల దృష్ట్యా బోర్‌వెల్ ఏర్పాటు చేయిస్తానని పేర్కొన్నారు. సంఘం అభివృద్ధికి సభ్యుల ఐక్యత ఎంతో ముఖ్యమని ఎంపీ అన్నారు. నూతన కార్యవర్గం సమష్టిగా పనిచేస్తూ సంఘాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. పూసల సంఘం అభివృద్ధికి, సభ్యుల సంక్షేమానికి తనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని గడ్డం వంశీకృష్ణ స్పష్టం చేశారు. నూతన కార్యవర్గం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు.