ఉద్యోగుల ఆరోగ్యంపై ప్రభుత్వానికి నిర్లక్ష్యమా? — టీ టీ యూ జిల్లా అధ్యక్షుడు పి. ప్రసాద్
సంగారెడ్డి;రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకానికి నిధులు కేటాయిస్తున్న ప్రభుత్వం, ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని కాపాడే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కు నిధులు ఎందుకు కేటాయించడం లేదని తెలంగాణ టీచర్స్ యూనియన్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి. ప్రసాద్ ప్రశ్నించారు.ఈ ఎచ్ ఎస్ సేవల్లో ఎదురవుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆదివారం పోతిరెడ్డిపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో నిర్వహించిన టీ టీ యూ జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. ఉద్యోగుల జీతాల నుంచి ప్రతి నెలా ఈ ఎచ్ ఎస్ పేరుతో రూ.300 నుంచి రూ.2,000 వరకు మినహాయిస్తున్నప్పటికీ, ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు.ఆసుపత్రుల్లో నిలిచిపోతున్న వైద్య సేవలు ఈ ఎచ్ ఎస్ కింద ఆసుపత్రులకు సుమారు రూ.500 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, దీంతో పలు కార్పొరేట్ ఆసుపత్రులు ఈ ఎచ్ ఎస్ కార్డులపై చికిత్స అందించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ప్రసాద్ ఆరోపించారు. సర్వర్ సమస్యలు, అనుమతులు రాకపోవడం వంటి కారణాలతో రోగులను నగదు చెల్లించాలని ఆసుపత్రులు కోరుతున్నాయని తెలిపారు.గత వారం రోజుల్లో సంగారెడ్డి జిల్లాలోనే 50 మందికి పైగా ఉపాధ్యాయులు, ఉద్యోగులు సొంత డబ్బులు చెల్లించి వైద్యం చేయించుకున్నారని ఆయన పేర్కొన్నారు. అత్యవసర వైద్యం కోసం లక్షల రూపాయలు అప్పు చేసి ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉద్యోగులకు ఎదురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ఎచ్ ఎస్ సేవలు పునరుద్ధరించాలి ఉద్యోగుల జీతాల నుంచి మినహాయిస్తున్న మొత్తాలకు అనుగుణంగా వారికి వైద్య సేవలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ ఎచ్ ఎస్ సర్వర్ సమస్యలను పరిష్కరించి, అన్ని ఆసుపత్రుల్లో వైద్య సేవలను పునరుద్ధరించాలని కోరారు.లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా టీ టీ యూ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్‌కు పిలుపునివ్వడంతో పాటు, కలెక్టరేట్‌ల ఎదుట ఈ ఎచ్ ఎస్ కార్డుల దహన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ పరిస్థితికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.సమావేశంలో పాల్గొన్నవారు ఈ సమావేశంలో జిల్లా సహాధ్యక్షుడు బట్టు నరసింహరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి రవికుమార్, జిల్లా కార్యదర్శులు రాములు, జగన్మోహన్, మహిళా కార్యదర్శులు సౌజన్య, సుమాలిని, అలాగే గోరఖ్‌నాథ్, కోటేశ్వర్, కుమార్, రాజు తదితరులు పాల్గొన్నారు.