శంషాబాద్‌లో కలుషితమవుతున్న తొండుపల్లి చెరువు
అధికారుల నిర్లక్ష్యంపై స్ధానికుల విమర్శలు
జీహెచ్ఎంసీ శంషాబాద్ పరిసర ప్రాంతాల్లోని తొండుపల్లి చెరువులోకి సమీప గ్రామాలు, ప్రైవేట్ గోదాముల నుంచి మురుగు నీరు చేరడంతో చెరువు తీవ్రంగా కలుషితమవుతోంది. ఈ పరిస్థితి కొనసాగితే భూగర్భ జలాలు కలుషితమై ప్రజలకు, వ్యవసాయానికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో కాముని చెరువు కూడా మురుగు నీటితో కలుషితమైన విషయాన్ని గుర్తుచేస్తూ, తొండుపల్లి చెరువుకు అలాంటి పరిస్థితి రాకుండా అధికారులు తక్షణమే స్పందించాలని కోరుతున్నారు. అక్రమ నిర్మాణాలు, వాటి నుంచి వెలువడే మురుగు నీరు చెరువుల్లోకి చేరకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ వ్యవహారంపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ఉన్నత స్థాయిలో పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నారు.
పోతుల నర్సింహా, శంషాబాద్ మేజర్ న్యూస్.