BREAKING
చోరీ కేసులో ఐదుగురు నిందితుల అరెస్ట్ - బంగారు,వెండి వస్తువులు, రెండు మోటార్ సైకిళ్లు స్వాధీనం రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాల విచారణ 15 రోజుల్లో పూర్తి చేస్తాం ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి టెన్నిస్ కోర్టులో అదరగొట్టిన భారత స్టార్.. కెరీర్‌లో ఐదో ఏటీపీ డబుల్స్ టైటిల్ సాధించిన యూకీ బాంబ్రీ విశేషాలంకరణలో శ్రీకామాక్షి సమేత చంద్రమౌళీశ్వరస్వామి శ్రీనారాయణస్వామి దేవస్థానం ఆదాయం 1,61,150 రూపాయలు ఎన్నికల విధులకు కమర్షియల్ వాహనాలను వాడాలి రెస్లింగ్ పోటీల్లో పోరాడి ఓడిన భారతీయ రెజ్లర్ లలిత్.. తృటిలో చేజారిన కాంస్య పతకం అఫిలియేషన్ విదివిధానాలపై కమిటీ -సమగ్ర అధ్యయన కమిటీలో ఎస్వీయూ రిజిస్ట్రార్ కు చోటు హాళ్లను పరిశీలించిన కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ డూడి మూడో టీ20కి ముందు టీమిండియాను హెచ్చరించిన మోర్నే మోర్కెల్.. వెల్లింగ్టన్ గాలులపై ప్రత్యేక దృష్టి టీడీపీ చైర్మన్ అభ్యర్థి కాకాని అశోక్‌కు విశ్రాంత ఉద్యోగుల సంపూర్ణ మద్దతు. మండపాకలో పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు తణుకు రూరల్ సీఐ డి. వెంకటేశ్వరరావు పర్యవేక్షణ ఓట్లతో ఆశీర్వదించండి అండగా ఉంటా బిజెపి నేత వెంకీ అధికారంలో ఉన్నాం..... అభివృద్ధి మాకే సాధ్యం

MBBS ప్రవేశాల గడువు పొడిగించాలని NMCకి ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి: పరిశీలిస్తామన్న నేషనల్ మెడికల్ కౌన్సిల్

Select Suryaa Now
MBBS ప్రవేశాల గడువు పొడిగించాలని NMCకి ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి: పరిశీలిస్తామన్న నేషనల్ మెడికల్ కౌన్సిల్

 

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వైద్య విద్య ప్రవేశాల గడువును పెంచాలంటూ రాష్ట్ర ప్రభుత్వం, డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం (NTRUHS) కోరిన విజ్ఞప్తిపై నేషనల్ మెడికల్ కౌన్సిల్ (NMC) సానుకూలంగా స్పందించింది.

రాష్ట్రంలో స్టేట్ రౌండ్ కౌన్సెలింగ్ ప్రక్రియ అక్టోబర్ 23తోనే ముగియగా, ముందే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం MBBS, BDS ప్రవేశాల ముగింపు గడువు రేపటితో తీరనుంది. అయితే కౌన్సెలింగ్ పూర్తయినా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 112 NRI కోటా MBBS సీట్లు ఇంకా భర్తీ కాకుండా ఖాళీగా మిగిలిపోయాయి. ఈ నేపథ్యంలో మిగిలిపోయిన సీట్లను కూడా భర్తీ చేసుకునేందుకు వీలుగా ప్రవేశాల గడువును మరో 15 రోజులు పొడిగించాలని, అలాగే నీట్ యూజీ (NEET-UG) అర్హత శాతాన్ని (Cut-off percentile) తగ్గించాలని కోరుతూ ఎన్టీఆర్ వర్సిటీ ఎన్ఎంసీకి లేఖ రాసింది. దీనిపై స్పందించిన నేషనల్ మెడికల్ కౌన్సిల్, ఏపీ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను పరిశీలిస్తామని స్పష్టం చేసింది.