BREAKING
సమస్యాత్మక గ్రామాలు గుర్తించి అధికారులు అప్రమత్తంగా ఉండాలి తిరుపతిలో టీడీపీకి తిరుగులేదు జేబీ శ్రీనివాస్‌కు కమ్మ సంఘం మద్దతు 66 డివిజన్లలో టీడీపీ జెండా ఎగరడం ఖాయం విద్యార్థి హక్కుల పోరాటానికి బీఆర్ఎస్వీ బలోపేతం -బండచర్లపల్లి,రావురూకులలో నూతన విద్యార్థి కమిటీల ఏర్పాటు నటి ఇంద్రజ చేతుల మీదుగా ‘జుఒన్‌’ సూపర్‌ యాప్‌ ఆవిష్కరణ.. ఒకే వేదికపై 25 రకాల సేవలు! ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు మృత కార్మికుల కుటుంబాలకు యూనియన్ అండ.. -రూ.20 వేల సాయం! తుఫాను నేపథ్యంలో రైతులు అప్రమత్తత అవసరం * సూచనలు అందజేసిన మండల ఏవో మెట్ట మోహనరావు * అభివృద్ధి, సంక్షేమమే ప్రచార అస్త్రాలుగా ముందుకు సాగుదాం ... ఏకగ్రీవ ఎన్నిక ధ్రువపత్రం అందుకున్న సురేష్ నాయుడు స్థానిక సంస్థల జోరు.. రెబల్స్ తో పోరు సైకిల్ గుర్తుకే ఓటు వేయండి.. జడ్పిటిసి అభ్యర్థి శిరీష హడ్కో కాలనీలో వైఎస్సార్‌సీపీ ప్రచార జోరు ఎన్నికలు ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు టీడీపీకి బిగ్ షాక్‌.. వైఎస్సార్‌సీపీలోకి 156 కుటుంబాలు చేరిక! భవాని మందిరంలో హోమం అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు.

డిండి ప్రాజెక్ట్ రద్దు చేయాలని రైతాంగం డిమాండ్-ఎంపీ డీకే అరుణ

Select Suryaa Now
డిండి ప్రాజెక్ట్ రద్దు చేయాలని రైతాంగం డిమాండ్-ఎంపీ డీకే అరుణ

మహబూబ్ నగర్ సూర్య న్యూస్ -

డిండీ ప్రాజెక్ట్ రద్దుచేసి పాలమూరు ప్రజలను రైతాంగానికి న్యాయం చేయాలని ఎంపీ డీకే అరుణ ఈ రోజు  తన నివాసం మహబూబ్ నగర్ లో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.ఎంపీ అరుణ మాట్లాడుతూ,డిండి ప్రాజెక్ట్ పై గుత్తా సుఖేందర్ రెడ్డి పదేపదే మాట్లాడి, పాలమూరు రైతులను రెచ్చగొట్టొద్దు అన్నారు.డిండి నుంచి 0.6 TMC నీరు తీసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.ఇది ముమ్మాటికి ఈ ప్రాంత రైతుల నోట్లో మట్టి కొట్టడమే.గుత్తా సుఖేందర్ రెడ్డి వాఖ్యలు ఖండిస్తున్నాం అన్నారు.జాతీయ పార్టీలో ఉంటే.. రైతులకు జరిగే అన్యాయం ప్రశ్నించవద్దా.?ఇప్పుడు ఉన్నది అసలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కానేకాదు.జూరాల బదులు శ్రీశైలం బ్యాక్ వాటర్ కి.. నీటి అప్రోచ్ మార్చినప్పుడే.. ప్రాజెక్ట్ లక్ష్యమే దెబ్బతీశారని అన్నారు.72 జీవో లో డిండి ద్వారా నీళ్లు ఇవ్వాలని లేదు.*విభజన చట్టంలో పోలవరం మాదిరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇవ్వాలని ఆనాడు డిల్లీలో జరిగిన సమావేశంలో చెప్పాను.పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ మొదటి డీపీఆర్ ప్రకారం రివ్యూ చేసి, పనులు చేపట్టండి.జాతీయ హోదా అనే పదమే ప్రస్తుతం లేదు.కేవలం రాజకీయాల కోసమే మాటాడుతున్నారు.పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కు నిధులు ఇవ్వడానికి కేంద్రం సానుకూలంగా స్పందించిందని గతంలో డిల్లీ వేదికగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా ముఖంగా చెప్పారు.మూడేళ్లలో పాలమూరు ప్రాజెక్టులు ఏవీ పూర్తి చేయలేదు.జూరాల ప్రాజెక్టు మరమత్తులకు నిధులు కూడా విడుదల చేయడం లేదు.ప్రాజెక్టుల పై మీకు ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థమౌతుంది.కాంట్రాక్టులు, కమిషన్లు తప్ప వేరే ద్యాస మీకు లేదని అన్నారు.ఏ జిల్లా నీరు ఆ జిల్లా తీసుకోవాలని ఎప్పుడు చెప్పలేదు.నల్గొండకు అనేక అవకాశాలు ఉన్నాయి. నక్కల గండి, నాగార్జున సాగర్,ఎస్ ఎల్మ బిసి ,మ ల్లన్న సాగర్ నుంచి నీరు తీసుకోండని అన్నారు.భవిష్యత్ లో రెండు జిల్లాల ప్రజలు, రైతులు.. తరతరాలు కొట్టుకునే పరిస్తితి తేవద్దు అన్నారు.పాలమూరు రైతుల గురించి ఆలోచించండి, వారి హక్కులు హరించవద్దు.నల్గొండ నీటి సమస్యకు పట్టుదలకు పోకండి.. ప్రత్యామ్నాయం ఆలోచించండి.ఫ్లోరైడ్ సమస్య పేరుతో రాజకీయాలు చేయకండి.పాలమూరుకు కేసీఆర్ ఉరి తాడు వేస్తే.. రేవంత్ రెడ్డి ఉచ్చు బిగుస్తున్నారు.పాలమూరు లో పుట్టి,పెరిగిన రేవంత్ రెడ్డి, పాలమూరుకు అన్యాయం చేయాలని చూస్తున్నారు.మూడేళ్లలో పాలమూరు జిల్లాకు రేవంత్ రెడ్డి చేసింది ఏం లేదు.ఇప్పటికైనా పాలమూరు పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి చేయండి. డిండి లిఫ్ట్ రద్దు చేయండి.త్వరలో పాలమూరు పెండింగ్ ప్రాజెక్టుల సందర్శన చేపడతాం.డిండి లిఫ్ట్ రద్దు కు పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం.భవిష్యత్ కార్యాచరణ పై అందరితో చర్చించి.. ప్రకటిస్తాం.ప్రెస్ మీట్ లో బీజేపీ నాయకులు వీర బ్రాహ్మచారి, అయ్యగారి ప్రభాకర్ రెడ్డి,ముచ్చర్ల జనార్ధన్ రెడ్డి, , కార్పొరేటర్లు కిరణ్ కుమార్ రెడ్డి, మర్రి జ్యోతి, పాండు రంగారెడ్డి,నంది పేట రాజు,శివ నాయక్,తిరుపతి, ముఖ్య నేతలు,కార్యకర్తలు పాల్గొన్నారు.

ఓం ప్రకాష్-మహబూబ్ నగర్