ఇండిపెండెంట్ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి బోయ నాగేశ్వరికి పెరుగుతున్న ప్రజా మద్దతు
కదిరి మున్సిపల్ చైర్మన్ ఇండిపెం డెంట్ అభ్యర్థి బోయ నాగేశ్వరి ప్రజల నుండి ఆదరణ పొందుతున్నారు. ఇండిపెండెంట్ చైర్మన్ అభ్యర్థిగా బోయ నాగేశ్వరి మున్సిపాలిటీలోని అన్ని వర్గాల మద్దతు పొందడం లో ముందుం టున్నారు. ఆదివారం మున్సిపాలిటీలోని పలు వార్డుల పరిధిలో స్వతంత్ర చైర్మన్ అభ్యర్థి ఇంటింటా ప్రచార కార్యక్రమాన్ని కొనసాగించారు. సందర్భంగా ఓటర్లకు "కత్తి" గుర్తుకు ఓటేసి తనను చైర్మన్గా గెలిపించాలని అభ్యర్థించారు. తనను గెలిపిస్తే మీ ఇంటి ఆడబిడ్డగా మీ వెన్నంటే ఉంటా మీ సమస్యల పరిష్కారంలో ముందుంటానని భరోసా ఇస్తున్నారు.
ఇంటింటా ప్రచార కార్యక్రమానికి వెళ్తున్న బోయ నాగేశ్వరి మహిళ లకు బొట్టుపెట్టి అమ్మ, అక్క.. కత్తి గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించా లని అభ్యర్థిస్తు న్నారు. అలాగే పెద్దయ్య, తాత, అన్న అంటూ మాటలు కలుపుతూ కత్తి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలంటూ ప్రసన్నం చేసుకుం టున్నారు. చైర్మన్ అభ్యర్థి నాగేశ్వరి ప్రచార శైలి విభిన్నంగా ఉండడంతో ప్రజలను ఆకట్టు కుంటుంది. మీ ఆదరణ.. మంచి మనసుతో తనను దీవించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేయడం ప్రచార శైలి సాగడంపై సర్వాత్ర హర్షం వ్యక్తం అవుతోంది. ఈ కార్యక్రమంలో మహిళలు, అను చరులు పాల్గొన్నారు.