telangana
ఆర్టీఐ రాష్ట్ర కార్యదర్శిని అభినందించిన జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర
సూర్య,లింగంపేట్ : సమాచార హక్కు చట్టం రాష్ట్ర కార్యదర్శి లెగ్గేల రాజును కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు.లింగంపేట్ మండలం పర్మల్లా గ్రామానికి చెందిన లెగ్గేల రాజు శనివారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాల సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో రక్త దానం చేసారు.ఎల్లారెడ్డి సిఐ రాజరెడ్డి,లింగంపేట్ ఎస్ఐ దీపక్ కుమార్ ల చేతుల మీదుగా లెగ్గేల రాజు ప్రశాంస పత్రాన్ని అందకున్నారు.ఆయన చేసిన సేవా కార్యక్రమాలను వారు కొనియాడారు.ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేసి ప్రాణాలు కాపాడటం ఎంతో అభినందనీయమని అన్నారు.దింతో పాటు ఇప్పటికి పదిసార్లు రక్తదానం చేసి సామాజిక బాధ్యతను చాటుకున్న లేగ్గేల రాజును జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రతో పాటు పలువురు పోలీస్ అధికారులు అయన సేవగునానికి ప్రశాంషించారు.ఈ సందర్బంగా లెగ్గేల రాజు మాట్లాడుతూ అపదలో రక్తం అవసరం ఉన్న వ్యక్తులకు రక్తం డొనేట్ చేయడం సంతోషం కలిగిస్తుందన్నారు.