BREAKING
ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి టెన్నిస్ కోర్టులో అదరగొట్టిన భారత స్టార్.. కెరీర్‌లో ఐదో ఏటీపీ డబుల్స్ టైటిల్ సాధించిన యూకీ బాంబ్రీ విశేషాలంకరణలో శ్రీకామాక్షి సమేత చంద్రమౌళీశ్వరస్వామి శ్రీనారాయణస్వామి దేవస్థానం ఆదాయం 1,61,150 రూపాయలు ఎన్నికల విధులకు కమర్షియల్ వాహనాలను వాడాలి రెస్లింగ్ పోటీల్లో పోరాడి ఓడిన భారతీయ రెజ్లర్ లలిత్.. తృటిలో చేజారిన కాంస్య పతకం అఫిలియేషన్ విదివిధానాలపై కమిటీ -సమగ్ర అధ్యయన కమిటీలో ఎస్వీయూ రిజిస్ట్రార్ కు చోటు హాళ్లను పరిశీలించిన కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ డూడి మూడో టీ20కి ముందు టీమిండియాను హెచ్చరించిన మోర్నే మోర్కెల్.. వెల్లింగ్టన్ గాలులపై ప్రత్యేక దృష్టి టీడీపీ చైర్మన్ అభ్యర్థి కాకాని అశోక్‌కు విశ్రాంత ఉద్యోగుల సంపూర్ణ మద్దతు. మండపాకలో పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు తణుకు రూరల్ సీఐ డి. వెంకటేశ్వరరావు పర్యవేక్షణ ఓట్లతో ఆశీర్వదించండి అండగా ఉంటా బిజెపి నేత వెంకీ అధికారంలో ఉన్నాం..... అభివృద్ధి మాకే సాధ్యం జన్నారంలో పోలీసుల ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ డ్రాయింగ్ పోటీల్లో శ్రీ శారద విద్యానికేతన్ విద్యార్థిని ప్రతిభ

పోలింగ్‌ ప్రక్రియను నిష్పక్షపాతంగా పారదర్శకంగా నిర్వహించాలి....!

Select Suryaa Now
పోలింగ్‌ ప్రక్రియను నిష్పక్షపాతంగా పారదర్శకంగా నిర్వహించాలి....!

పోలింగ్‌ ప్రక్రియను నిష్పక్షపాతంగా పారదర్శకంగా నిర్వహించాలి....!
- ఎన్నికల విధివిధానాలపై పూర్తి అవగాహనతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి.

- పోలింగ్‌ విధులపై పూర్తి అవగాహన అవసరం
- పోలింగ్‌ ప్రారంభానికి ముందే ఏర్పాట్లు పూర్తి చేయాలి
- ఓటరు గుర్తింపు, ఓటు గోప్యతకు ప్రాధాన్యం

-  జిల్లా కలెక్టర్‌ రాజకుమారి గణియా సూచనలు

నందికొట్కూరు రూరల్ మేజర్ న్యూస్ -: 
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల విధివిధానాలపై పూర్తి అవగాహనతో, నిబంధనలను పాటిస్తూ పోలింగ్‌ ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ జి. రాజకుమారి పోలింగ్‌ అధికారులను ఆదేశించారు. ఆదివారం నందికొట్కూరు పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ అధికారులు, సహాయ పోలింగ్‌ అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల విధుల నిర్వహణ, నిబంధనల అమలు, పోలింగ్‌ కేంద్రాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.

పోలింగ్‌ విధులపై పూర్తి అవగాహన అవసరం-:

ఎన్నికల నిర్వహణలో పోలింగ్‌ అధికారులు, సహాయ పోలింగ్‌ అధికారుల పాత్ర అత్యంత కీలకమని కలెక్టర్‌ పేర్కొన్నారు. శిక్షణలో వివరించిన ఎన్నికల విధివిధానాలను క్షుణ్ణంగా అర్థం చేసుకుని, తమకు కేటాయించిన బాధ్యతలను సమన్వయంతో నిర్వర్తించాలని సూచించారు. పోలింగ్‌కు ముందు, పోలింగ్‌ సమయంలో, పోలింగ్‌ ముగిసిన అనంతరం చేపట్టాల్సిన విధులపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.*

పోలింగ్‌ ప్రారంభానికి ముందే ఏర్పాట్లు పూర్తి చేయాలి-:  పోలింగ్‌ రోజున నిర్ణీత సమయానికి ప్రక్రియ ప్రారంభమయ్యేలా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఎన్నికల సామగ్రి, అవసరమైన ఫారాలు, రిజిస్టర్లు, ఓటరు జాబితా తదితర అంశాలను పరిశీలించుకోవాలని సూచించారు. పోలింగ్‌ కేంద్రాల్లో విధులు నిర్వర్తించే సిబ్బంది పరస్పర సమన్వయంతో పనిచేస్తూ, ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలన్నారు.

ఓటరు గుర్తింపు, ఓటు గోప్యతకు ప్రాధాన్యం-:

ఓటరు గుర్తింపు, ఓటరు జాబితా పరిశీలన, ఓటు హక్కు వినియోగానికి సంబంధించిన ప్రతి అంశాన్ని ఎన్నికల నిబంధనల ప్రకారం నిర్వహించాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఓటరు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా సహకరించాలని, ఓటింగ్‌ గోప్యతకు భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్‌ కేంద్రాల్లో అనధికార వ్యక్తుల జోక్యానికి అవకాశం కల్పించరాదని, ఓటర్లందరితో సమానంగా వ్యవహరిస్తూ నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని తెలిపారు.

సమస్యలు తలెత్తితే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలి-:

పోలింగ్‌ సమయంలో ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే సంబంధిత రిటర్నింగ్‌ అధికారి, సహాయ రిటర్నింగ్‌ అధికారి లేదా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని కలెక్టర్‌ సూచించారు. పోలింగ్‌ కేంద్రాల్లో ప్రశాంత వాతావరణం కొనసాగించేలా అప్రమత్తంగా ఉండాలని, ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన సహకారం అందించాలని ఆదేశించారు. పోలింగ్‌ ముగిసిన అనంతరం ఎన్నికల సామగ్రి భద్రపరచడం, సంబంధిత రికార్డులను సక్రమంగా నిర్వహించడం, నిర్దేశించిన విధానంలో సామగ్రిని అప్పగించడం వంటి బాధ్యతలను జాగ్రత్తగా పూర్తి చేయాలని తెలిపారు.ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటిస్తూ, విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావులేకుండా శిక్షణలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని జిల్లా కలెక్టర్‌ అధికారులను సూచించారు.