మంచి పనులకోసం మహబూబ్ బాషా ఎన్నిక కావాలి
మంచి పనులకోసం మహబూబ్ బాషా ఎన్నిక కావాలి
15వ వార్డు టీడీపీ అభ్యర్థికి మద్దతుగా ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి ప్రచారం
ఎమ్మిగనూరు,టౌన్ సూర్య ప్రతినిధి పట్టణంలోని 15వ వార్డు టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి మహబూబ్ బాషాకు మద్దతుగా ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలను కలుసుకుని కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
మహబూబ్ బాషా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేసే నాయకుడని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వార్డు అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనలో కౌన్సిలర్ పాత్ర కీలకమని తెలిపారు. ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే నాయకత్వం అవసరమన్నారు.
ఎమ్మిగనూరు పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కారానికి గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి పైప్‌లైన్ ద్వారా రోజుకు మూడు పూటలా నీరు అందించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. పట్టణ అభివృద్ధితో పాటు ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి మాచాని సునీతకు కూడా ప్రజలు మద్దతు తెలిపి పట్టణ అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. 15వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి మహబూబ్ బాషాను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.
ఈ ప్రచార కార్యక్రమంలో కుర్ని కార్పొరేషన్ చైర్మన్ కామార్తి మిన్నప్ప, టీడీపీ నాయకులు రషీద్, బుగిడే నాగరాజు, సూరి తదితరులు పాల్గొన్నారు.
జిలాని బాషా ఎమ్మిగనూరు టౌన్ సూర్య ప్రతినిధి కర్నూలు జిల్లా