By సూర్య ప్రతినిధి
Updated : 25 Oct 2026 18:18 IST
Select Suryaa Now
సూర్య న్యూస్ అద్దంకి.
అద్దంకి మండలంలో నామినేషన్ల ఉపసంహరణకు సంబంధించిన వివరాలను మండల ఆర్ఓ రవికుమార్ తెలిపారు. నామినేషన్లను ఉపసంహరించుకోవాలనుకునే అభ్యర్థులు 27వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం కలిగి ఉంటారనీ స్పష్టం చేశారు. ఎన్నికల నిబంధనల ప్రకారం, నామినేషన్ ఉపసంహరించుకోవాలనుకునే అభ్యర్థి స్వయంగా వచ్చి నోటీసు అందజేయాల్సి ఉంటుంది. అభ్యర్థి రాలేని పక్షంలో ప్రతిపాదించిన వ్యక్తి వచ్చి నోటీసు ఇవ్వవచ్చునని, అయితే అభ్యర్థి సంతకం మాత్రం తప్పనిసరి అని తెలిపారు. అభ్యర్థుల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత, పోటీలో ఉన్న తుది అభ్యర్థుల జాబితాను పార్టీల 'బి' ఫారాలు మరియు సింబల్స్‌తో కేటాయించడం జరుగుతుందని ఆయన వివరించారు.