BREAKING
స్థానిక సంస్థల ఎన్నికల విధులపై పి ఓ అసిస్టెంట్ పి వో లకు శిక్షణ ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి --మంత్రి పొంగులేటికి ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల జేఏసీ నాయకుల వినతి ఉద్యోగుల ఆరోగ్యంపై ప్రభుత్వానికి నిర్లక్ష్యమా? — టీ టీ యూ జిల్లా అధ్యక్షుడు పి. ప్రసాద్ 'ఇడుపు కాయితం' సినిమా పాటపై వస్తున్న ట్రోల్స్‌పై స్పందించిన డైరెక్టర్ వేణు ఉడుగుల! డిండి ప్రాజెక్ట్ రద్దు చేయాలని రైతాంగం డిమాండ్-ఎంపీ డీకే అరుణ ఎంబిబిఎస్ సీట్ సాధించిన వంశి యాదవ్ కు ఘన సన్మానం గ్యార్మి వేడుకలు మత సామరస్యానికి ప్రతీక కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు వి.చంద్రారెడ్డి మున్సిపల్ ప్రచారంలో ఎమ్మెల్యేకు సమస్యల ఏకరువు ఔట్‌ఫాల్ స్లూయిజుల పునర్నిర్మాణానికి రూ.47.50 కోట్లు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవ పూసల సంఘం భవన నిర్మాణానికి ఎంపీ నిధులు కేటాయిస్తా.. బోర్‌వెల్ వేయిస్తా: ఎంపీ గడ్డం వంశీకృష్ణ వైసీపీ అభ్యర్థుల గెలుపుతోనే నగరాభివృద్ధి తలారి రంగయ్య ఆదేశాల మేరకు గోళ్ళ పంచాయతీలో వైఎస్ఆర్సిపి ఎంపీటీసీ జడ్పిటిసి అభ్యర్థులు విస్తృత ప్రచారం. ప్రజాసేవ లక్ష్యం... -54వ డివిజన్ లో బోయళ్ళ శాంతి MBBS ప్రవేశాల గడువు పొడిగించాలని NMCకి ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి: పరిశీలిస్తామన్న నేషనల్ మెడికల్ కౌన్సిల్ కౌసర్ కు బాసటగా టి సి యామిని, బల్ల పల్లవి.. 32వ డివిజన్లో ఇంటింటా ప్రచారం

109వ డివిజన్‌లో వైసీపీ నుంచి జనసేనలోకి 200 మంది కార్యకర్తల చేరిక

Select Suryaa Now
 109వ డివిజన్‌లో వైసీపీ నుంచి జనసేనలోకి 200 మంది కార్యకర్తల చేరిక

అనకాపల్లి, జీవీఎంసీ స్థానిక ఎన్నికల నేపథ్యంలో అనకాపల్లి 109వ డివిజన్‌ రామనాయుడు కాలనీకి చెందిన సుమారు 200 మంది వైసీపీ కార్యకర్తలు ప్రముఖ వైద్యులు, మాజీ వైసీపీ నాయకుడు బొడ్డెడ లక్ష్మీనరసింహ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. అనకాపల్లి జనసేన పార్టీ ఇన్‌చార్జి  భీమరశెట్టి రామ్కీ సమక్షంలో, సినీ నటుడు హైపర్ ఆది చేతుల మీదుగా వీరు పార్టీ కండువాలు కప్పుకున్నారు.ఈ సందర్భంగా  రామ్కీ  మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, అనకాపల్లి అభివృద్ధికి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ   చేస్తున్న కృషికి ఆకర్షితులై పలువురు జనసేనలో చేరుతున్నారని తెలిపారు. సినీ నటుడు హైపర్ ఆది మాట్లాడుతూ, 2024 ఎన్నికల సమయంలో పిఠాపురం తర్వాత తాను ప్రచారం చేసిన అనకాపల్లి నియోజకవర్గంలో కొణతాల రామకృష్ణ  నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి గురించి ప్రజలు ప్రస్తావిస్తున్నారని అన్నారు. రాష్ట్రంతో పాటు అనకాపల్లి అభివృద్ధి చెందేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజలు గుర్తిస్తున్నారని తెలిపారు.
బొడ్డెడ లక్ష్మీనరసింహ మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేశారు. కొణతాల రామకృష్ణ  నాయకత్వంలో, జనసేన పార్టీ ఇన్‌చార్జి రామ్కీ  సారథ్యంలో అనకాపల్లిలో జనసేన, కూటమి బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో 19వ డివిజన్‌లో పోటీ చేస్తున్న టీడీపీ, బీజేపీ బలపరిచిన జనసేన అభ్యర్థి బుద్ధ జ్యోతి శ్రీనివాస్‌ కు మద్దతుగా పనిచేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో నూకాంబిక అమ్మవారి దేవస్థానం మాజీ చైర్మన్ కొణతాల మురళీకృష్ణ, 109వ డివిజన్ జనసేన నాయకుడు కాండ్రేగుల శ్రీరామ్, రాష్ట్ర గవర కార్పొరేషన్ డైరెక్టర్ విల్లూరి హరికృష్ణతో పాటు పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.