కందుకూరులో ఘనంగా రజక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అలాయ్ బలాయ్ కార్యక్రమం
కందుకూరులో ఘనంగా రజక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అలాయ్ బలాయ్ కార్యక్రమం
కందుకూరు: మండల రజక అభివృద్ధి సంస్థ అధ్యక్షుడు అక్కెనపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహేశ్వరం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సీహెచ్ యాదయ్య, రజక అభివృద్ధి సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ. శ్రీరాములు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలంతా ఐక్యంగా ఉండాలని, సామాజిక ఐక్యతతో పాటు రాజకీయంగా కూడా ఎదగాలని పిలుపునిచ్చారు. వార్డు సభ్యుల స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు బీసీలు ప్రాతినిధ్యం వహించేలా కృషి చేయాలని సూచించారు. ఇలాంటి ఐక్యతా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎగ్గిది సత్తయ్యతో పాటు మండల కురుమ సంఘం అధ్యక్షులు అచ్చన్న పాండు, మాజీ సర్పంచ్ బాలకృష్ణ బిజెపి నాయకుడు యాదన్న జిల్లా నాయకులు బొమ్మరాజు మల్లేష్ సోమరాజు కృష్ణ రఘువీర్ జిల్లా రజక అభివృద్ధి సంస్థ ప్రధాన కార్యదర్శి వెంకటేష్ మండల ప్రధాన కార్యదర్శి కిషన్ ఉపాధ్యక్షులు కుమార్ మండల నాయకులు గణేష్ బాలరాజ్ డిసిసిబి డైరెక్టర్ పొట్టి ఆనంద్ ధార కుమార్ ఊటు మహేందర్ వివిధ బీసీ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, కందుకూరు మండలంలోని అన్ని గ్రామాల రజకులు పాల్గొన్నారు.