BREAKING
టిఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు దాదాపు శతాబ్దం తర్వాత బ్రిటిష్ కొలంబియాలో గెలుపొందిన కన్జర్వేటివ్ పార్టీ ఆర్టీఐ రాష్ట్ర కార్యదర్శిని అభినందించిన జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర వైఎస్ఆర్ పార్టీలో చేరిన జనసేన నాయకులు ఉత్తరప్రదేశ్ నా జన్మస్థలం.. ఎన్ని నగరాల్లో తిరిగినా నేను ఆ రాష్ట్రం బిడ్డనే అంటున్న 'మీర్జాపూర్' నటి శ్వేతా త్రిపాఠి! సెనెగల్ రాజకీయాల్లో తీవ్ర ప్రతిష్టంభన మన్ కీ బాత్’లో కొమురం భీమ్ త్యాగాన్ని స్మరించిన ప్రధాని నరేంద్ర మోదీ స్విట్జర్లాండ్‌లో ఉద్యోగాల కోత భయం మంచి పనులకోసం మహబూబ్ బాషా ఎన్నిక కావాలి నాని 'ది ప్యారడైజ్' సినిమాపై ఘాటు రివ్యూ ఇచ్చిన మహేష్ బాబు కుమారుడు గౌతమ్.. 'చాలా నిరాశపరిచింది' అంటూ పోస్ట్! ఇండిపెండెంట్ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి బోయ నాగేశ్వరికి పెరుగుతున్న ప్రజా మద్దతు బెంజమిన్ నెతన్యాహు ప్రతిపాదనలపై తీవ్ర వ్యతిరేకత పరిణీతి చోప్రా 'షక్' చిత్రంలో తన సీన్లు తొలగించడంపై అనూప్ సోని తీవ్ర నిరాశ.. స్పందించిన నటుడు! కందుకూరులో ఘనంగా రజక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అలాయ్‌ బలాయ్‌ కార్యక్రమం 109వ డివిజన్‌లో వైసీపీ నుంచి జనసేనలోకి 200 మంది కార్యకర్తల చేరిక

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి....!

Select Suryaa Now
మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి....!

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి....!

- స్ట్రాంగ్‌ రూమ్‌ల భద్రతకు అత్యంత ప్రాధాన్యత

- డిస్ట్రిబ్యూషన్‌, రిసెప్షన్‌ కేంద్రాల్లో సమన్వయంతో ఏర్పాట్లు

- కౌంటింగ్‌ కేంద్రాల్లో అవసరమైన సదుపాయాలు కల్పించాలి

- ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు చర్యలు

- నంద్యాల జిల్లా కలెక్టర్‌ రాజకుమారి గణియా

నందికొట్కూరు రూరల్ మేజర్ న్యూస్ -: 
మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు సంబంధించి స్ట్రాంగ్‌ రూమ్‌లు, ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలు, రిసెప్షన్‌ కేంద్రాలు, కౌంటింగ్‌ హాళ్లలో అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని నంద్యాల జిల్లా కలెక్టర్‌  జి. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికల సామగ్రి భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఏర్పాటును పర్యవేక్షించాలని సూచించారు. ఆదివారం నందికొట్కూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌, రిసెప్షన్‌ సెంటర్‌, కౌంటింగ్‌ హాళ్లను జిల్లా కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లను సమీక్షించి, కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, భద్రత, సిబ్బంది విధుల నిర్వహణకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు.

స్ట్రాంగ్‌ రూమ్‌ల భద్రతకు అత్యంత ప్రాధాన్యత-:

స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు కల్పించాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఎన్నికల సామగ్రి భద్రపరిచే గదుల్లోకి అనధికార వ్యక్తులు ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని, భద్రతా ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు స్ట్రాంగ్‌ రూమ్‌ల నిర్వహణ చేపట్టాలని, భద్రతా సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వర్తించేలా చూడాలని తెలిపారు.

- : డిస్ట్రిబ్యూషన్‌, రిసెప్షన్‌ కేంద్రాల్లో సమన్వయంతో ఏర్పాట్లు

ఎన్నికల విధులకు హాజరయ్యే సిబ్బందికి ఎన్నికల సామగ్రి పంపిణీ సజావుగా జరిగేలా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్‌ సూచించారు. పోలింగ్‌ సిబ్బందికి అవసరమైన సామగ్రిని సక్రమంగా అందజేసేందుకు కౌంటర్లు, సిబ్బంది కేటాయింపు, రికార్డుల నిర్వహణ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. పోలింగ్‌ అనంతరం ఎన్నికల సామగ్రి స్వీకరణకు రిసెప్షన్‌ కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేయాలని, సామగ్రి స్వీకరణ, రికార్డుల నమోదు, భద్రపరిచే ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

-: కౌంటింగ్‌ కేంద్రాల్లో అవసరమైన సదుపాయాలు కల్పించాలి

ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. కౌంటింగ్‌ హాళ్లలో తగిన స్థలం, సిబ్బందికి అవసరమైన సదుపాయాలు, విద్యుత్‌, వెలుతురు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించాలని సూచించారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తూ, ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని కేంద్రాల్లో విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది మధ్య సమన్వయం ఉండాలని, అప్పగించిన బాధ్యతలను సమయపాలనతో పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు చర్యలు-: 
రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్‌కు అనుగుణంగా ఎన్నికల ప్రక్రియలోని ప్రతి దశను నిబంధనల ప్రకారం నిర్వహించాలని కలెక్టర్‌ సూచించారు. జిల్లాలోని ఆరు అర్బన్‌ లోకల్‌ బాడీలకు సంబంధించి ఎన్నికల ఏర్పాట్లను సమర్థవంతంగా పూర్తి చేయాలని, పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు, ఏకగ్రీవంగా ఎన్నికైన స్థానాలకు సంబంధించిన సమాచారాన్ని నిబంధనల ప్రకారం ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా, భద్రతా ప్రమాణాలు పాటిస్తూ అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు.