తల సేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు
సూర్య- దోమకొండ : మండల కేంద్రంలో స్థానిక మార్కండేయ మందిరంలో పద్మశాలి సంఘం&ఉగాది సిండికేట్ సంయుక్తా ఆధ్వర్యంలో తలసేమియా బాధిత చిన్నారుల కోసం నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఎస్సై ప్రభాకర్, గ్రామ సర్పంచ్ ఐరేని నరసయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయ సభ్యులు డాక్టర్ బాలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న బాలె సురేందర్,మ్యాక నాగరాజుల ను అభినందించి సన్మానించారు. రాష్ట్ర వ్యాప్తంగా 7 వేల యూనిట్లకు పైగా చిన్నారులు తల సేమియా వ్యాధితో బాధపడుతున్నారని ఈ చిన్నారులకు ప్రతి 15 రోజులకు ఒక యూనిట్ రక్తం వారి జీవితాంతం అవసరం ఉంటుందని వారి ప్రాణాలను కాపాడడానికి యువత రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలని రక్తదాన శిబిరాలకు కావలసిన పూర్తి సహాయ సహకారాలను కామారెడ్డి రక్తదాతల సమూహం,ఇండియన్,రెడ్ క్రాస్ సొసైటీల ఆధ్వర్యంలో అందజేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నామని అన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని రక్తదాన శిబిరాలను నిర్వహించి చిన్నారుల ప్రాణాలను కాపాడడానికి కృషి చేస్తామని అన్నారు. రక్తానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవని మానవతా దృక్పథంతో ముందుకు వస్తేనే సకాలంలో రక్తాన్ని అందజేసి ప్రాణాలను కాపాడగలుగుతామని రక్తదాన శిబిరంలో పాల్గొనే రక్తదానం చేసిన రక్తదాతలకు ప్రశంస పత్రాలను,స్టీల్ వాటర్ బాటిల్స్ అందజేశారు.ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షులు మేక నాగరాజు, చేనేత సహకార సొసైటీ డైరెక్టర్ బాలే సురేందర్ మండల అధ్యక్షులు అందె గణేశ్, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది బట్టు భరద్వాజ్, డాక్టర్ అజయ్, టెక్నీషియన్లు సతీశ్,గౌతం, భరత్ లు పాల్గొన్నారు