BREAKING
స్టేజ్ పైనుంచి పంపించివేయడంపై తీవ్రంగా కలత చెందిన శిల్పా రావు.. స్పందించిన మ్యూజిక్ ప్రాజెక్ట్ నిర్వాహకులు! అభివృద్ధి కోసం.. కూటమికి పురపాలన అందించండి.. ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి ప్రీ పరేడ్ కు పియూ విద్యార్థి రాణా ప్రతాప్ ఎంపిక బాలవికాస ఆధ్వర్యంలో 40 మంది వృద్ధులకు నిత్యవసర సరుకులు సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళిక బిగ్‌బాస్ 20 వేదికపై గ్యాంగ్‌స్టర్ కల్చర్‌పై రోహిత్ శెట్టి ఆగ్రహం.. టైగర్ ష్రాఫ్ మరియు తనపై జరిగిన కాల్పుల ఘటనలపై వ్యాఖ్యలు! మానకొండూరు మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం ఘూస్‌ఖోర్ పండిత్' వివాదం ప్రభావం 'గజబ్ రాత్'పై పడదు.. మనోజ్ బాజ్‌పేయీ, నీరజ్ పాండే ధీమా! తల సేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు హింసాత్మక సినిమాలు చూస్తూ పాప్‌కార్న్ ఎలా తింటారు? రాధికా ఆప్టే సంచలన వ్యాఖ్యలు! బాక్సాఫీస్ వద్ద విజృంభిస్తున్న ‘ఉడ్తా తీర్’.. శనివారం రోజు ఏకంగా 75 శాతం పెరిగిన కలెక్షన్లు! 20 వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి షాహినా జోరుగా ఎన్నికల ప్రచారం మంచిర్యాల ముదిరాజ్ భవనానికి ఎంపీ నిధుల నుంచి రూ.25 లక్షలు కేటాయిస్తా అవకాశం ఇవ్వండి...మార్పు చూపిస్తా -కార్పొరేటర్ అభ్యర్థి రాజారెడ్డి అభ్యర్థన కోస్తాంధ్రకు హైఅలర్ట్.. కాకినాడ - నర్సాపురం మధ్య తీరం దాటనున్న తుఫాన్!

స్థానికులకు అందుబాటులో ఉంటాం... -64, 66 డివిజన్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం : కార్పొరేటర్ అభ్యర్థులు అన్నా మల్లీశ్వరి, అన్నా లోకేష్

Select Suryaa Now
స్థానికులకు అందుబాటులో ఉంటాం... -64, 66 డివిజన్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం : కార్పొరేటర్ అభ్యర్థులు అన్నా మల్లీశ్వరి, అన్నా లోకేష్

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : 64, 66 డివిజన్లలో ప్రతి సమస్యను పరిష్కరించి స్థానికులకు నిత్యం అందుబాటులో ఉంటామని టిడిపి కార్పొరేటర్ అభ్యర్థులు అన్నా మల్లీశ్వరి, అన్నా లోకేష్ తెలిపారు. ఆదివారం స్థానిక జీవకోనలోని జీవలింగేశ్వర స్వామి ఆలయంలో 54, 61, 62, 63 64, 65, 66 డివిజన్లకు చెందిన కూటమికి చెందిన కార్పొరేటర్ అభ్యర్థులతో కలిసి టిడిపి సీనియర్ నాయకులు అన్నా రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి అన్నా అనిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవంబరు ఒకటో తేదీ జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కూటమి తరపున మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జెబి శ్రీనివాస్, తో పాటు జనసేన, బిజెపి, టిడిపి, కార్పొరేటర్ అభ్యర్థుల విజయం సాధించాలని స్వామి వారిని మొక్కుకున్నట్లు ఆమె తెలిపారు. అనంతరం జీవకోన ఆలయం నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. తొలిత 64 డివిజన్లకు చెదిన కార్పొరేటర్ అభ్యర్థుల తో కలిసి టిడిపి రాష్ట్ర కార్యదర్శి అన్నా అనిత ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంచుతూ మహిళలను కలసి సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. తమకు ఈ డివిజన్లతో చిన్నప్పటి నుంచి సంబంధం ఉందని, కుటుంబ సభ్యులుగా భావించి తమను ఆదరించాలని కోరారు. చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ప్రజాసేవకు అంకితమైందని, వారి ఆశీస్సులతో కూటమి అభ్యర్థులు పోటీ చేస్తున్న అన్ని డివిజన్లులో సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తారని తెలిపారు. తమ అమూల్యమైన ఓటును కూటమి అభ్యర్థులకు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అభ్యర్థులు బోయల్ల శాంతి, రేవతి, పార్ధు, పుష్పవతి, మంజులతో పాటు స్థానిక నాయకులు శ్రీకాకుళం చిరంజీవి, రఫీ హిందుస్తానీ, సుబ్బు ధనుంజయ రెడ్డి ఆది కేశవులు సుధా శ్రీనివాస్ యాదవ్ నాగరాజు నాయుడు మురళి, శర్వణ, బుజ్జమ్మ కే అహ్మద్ ఎం సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్